యువతిని ఎర వేసి... ట్రాప్‌లో పడి హత్యకు గురైన యువకుడు...

తూర్పు గోదావరి జిల్లాలో హానీ ట్రాప్ తరహాలో జరిగిన ఓ హత్య ఆలస్యంగా వెలుగుచూసింది. భూ తగాదాల నేపథ్యంలో ఓ యువకుడికి యువతితో ఆకర్షించి హత్య చేసిన ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. గతేడాది డిసెంబర్ 8న కాకినాడలో రామకృష్ణ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నప్పటికీ... దర్యాప్తు సరిగా సాగట్లేదని మృతుడి కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు న్యాయస్థానం ఆదేశాలతో దర్యాప్తు వేగవంతమైంది.

east godavari police chased a murder mystery of a youth who trapped by a woman

కాట్రోనికోన మండలం చెయ్యేరుకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తిని,అతనికి పరిచయం ఉన్న మరో యువతిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. విచారణలో ఈ ఇద్దరే రామకృష్ణను హత్య చేసినట్టు తేలింది. రామకృష్ణకు శ్రీనివాస్‌కు మధ్య కొంతకాలంగా భూ తగాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనకు పరిచయం ఉన్న ఓ యువతిని రామకృష్ణకు శ్రీనివాస్ ఎరగా వేశాడు.

రామకృష్ణ వెనుకా ముందు ఆలోచించకుండా ఆ అమ్మాయి వలలో పడిపోయాడు. ఇదే క్రమంలో గతేడాది డిసెంబర్ 8న ఆ యువతి రామకృష్ణను కాకినాడ తీసుకొచ్చింది. అక్కడి నుంచి అరట్లకట్టకు తీసుకెళ్లగా... అక్కడే ఉన్న శ్రీనివాస్ రామకృష్ణను హత్య చేసి పంట కాల్వలో పడేశాడు. ఆపై ఇద్దరూ అక్కడినుంచి పరారయ్యారు. విచారణలో నిజాలు బయటపడటంతో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+