నొప్పి లేకుండా చనిపోవటం ఎలా .. పరిశోధన చేసి మరీ షాకింగ్ సూసైడ్
అనారోగ్యం బారిన పడిన ఓ యువకుడు తాను చనిపోవాలని నిశ్చయించుకున్నాడు. అయితే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆ యువకుడు చేసిన పని ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తుంది. ఏ మాత్రం బాధ లేకుండా ప్రాణాలు తీసుకోవాలని భావించిన అతను, నాలుగు రోజుల పాటు యూ ట్యూబ్ వీడియోలు చూసి మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఇది ఎక్కడో జరిగిన విషయం కాదు. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట సమీపంలో జరిగింది ఘటన. సంఘటనకు సంబంధించిన పోలీసులు వెల్లడించిన వివరాలను చూస్తే 35 సంవత్సరాల వయసున్న లెక్కల రామ చంద్రుడు అనే వ్యక్తి గత కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. చనిపోవాలని నిర్ణయం తీసుకున్న అతను రాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేని టైం చూసి వాష్ రూమ్ లోకి వెళ్లి చాకుతో కోసుకున్నాడు. మెడ చేతులపై చాకుతో కోసుకోవడం తో తీవ్ర రక్తస్రావం అయిన లెక్కల రామచంద్రుడు ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అతని సెల్ ఫోన్ చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే అతని సెల్ ఫోన్ లో నొప్పి లేకుండా మరణించడం ఎలా అన్న విషయంపై నాలుగు రోజులపాటు అతను వీడియోలు చూసినట్లుగా పోలీసులు గుర్తించారు. మొత్తానికి చాకుతో కోసుకొని మృత్యువాత పడిన లెక్కల రామచంద్రుడు నొప్పి లేకుండా చనిపోవాలని నిర్ణయం తీసుకోవడంతోనే వీడియోలు చూసినట్లుగా తెలుస్తుంది.
ఇంతా పరిశోధన చేసి చాకుతో కోసుకున్నాడు అంటే మరణం ఏదైనా ఎలా సంభవించినా నొప్పి, బాధ ఉంటుందనే సంకేతమే అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చాకుతో చేతులు,మెడ కోసుకున్న లెక్కల రామచంద్రుడు అంత పరిశోధన చేసి మరి నొప్పి, బాధతోనే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications