పోలీసులు, ఉద్యోగులపై దాడి.. కళ్లలో కారం.. రేషన్ డీలర్ హంగామా
ఓ రేషన్ డీలర్ హల్ చల్ చేసింది. పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి చుక్కలు చూపించింది. డీలర్‌పై ఆరోపణలు రావడంతో అక్కడికి చేరుకున్నారు. కానీ ఆమె ప్రతాపం తన ప్రతాపం చూపించింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. రాయవరం మండలం నడురబడ గ్రామంలో రేషన్ డిపో స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అధికారులకు చుక్కలు చూపించింది.
మిర్తిపాటి జ్యోతి అనే రేషన్ డీలర్..ప్రభుత్వ ఉద్యోగులతో వాదనకు దిగింది. అంతేకాదు వారి కళ్లలోకి కారం చల్లింది. సచివాలయ మహిళా పోలీస్, ఉద్యోగుల కళ్లలో కారం కొట్టిడంతో కాసేపు ఉద్రిక్ పరిస్థితి నెలకొంది. ఆర్డీవో సింధు, డీఎస్పీ బాలచంద్రారెడ్డి సమక్షంలో ఈ దాడి జరగడం విశేషం. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై దాడి చేసిన రేషన్ డీలర్ జ్యోతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తనకు రేషన్ బియ్యంలో ఒక్క గింజ అవసరం లేదని ప్రభుత్వ ఉద్యోగులతో రేషన్ డీలర్ జ్యోతి వాదనకు దిగింది. రాజకీయ నేతల మాట విని తప్పుచేసి..ఆ తప్పు తనపైకి గెంటేస్తా ఎలా అని ఎదురు తిరిగింది. ఆ సమయంలో ఆర్డీవో సింధు ఏం చెబుతున్నా వినిపించుకోలేదు. కళ్లలో కారం వేయొచ్చా అని ఓ ఉద్యోగి నిలదీసినా డీలర్ మిర్తిపాటి జ్యోతి మొండిగా వాదించింది.
రేషన్ బియ్యానికి సంబంధించి లెక్క తేడా వచ్చి ఉంటుంది. దానిపై వివరణ అడిగినా స్పందించలేదు. అందుకే అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అందుకు డీలర్ నిరాకరించారు. అంతేకాదు తనపై ఆరోపణలు అంటూ ప్రతాపం చూపించారు. బియ్యం గింజ కూడా తీసుకోలేదని చెప్పి.. తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆమె అవినీతికి పాల్పడినట్టు అర్థం అవుతోంది.












Click it and Unblock the Notifications