video:మహాపాపం, శివలింగానికి టెంట్ తాడు, అందుకోసమేనట, సోము వీర్రాజ్ ఫైర్
ఏపీలో మరో వివాదం చెలరేగింది. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో జగనన్న చేయూత కార్యక్రమం చేపట్టారు. అయితే టెంటు కోసం తాళ్లను పక్కనే గల గుడిలో ఉన్న శివలింగానికి కట్టారు. దీంతో హిందు సంస్థలు/ బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆ వీడియోను ట్వీట్ చేశారు. జగన్ సర్కార్ వైఖరిని తప్పుపట్టారు.
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారని సోము వీర్రాజు మండిపడ్డారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడేవారిపై కోరారు. టెంట్ తాళ్లను శివలింగానికి కట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిర్వాహకులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.శివలింగానికి కట్టిన టెంట్ తాళ్లను నిర్వాహకులు వెంటనే తొలగించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఘటనపై టీడీపీ కూడా స్పందించింది. వీరి పాపం పండే రోజు త్వరలోనే వస్తుందని పేర్కొంది. ఇదీ మంచి పద్దతి కాదని హితవు పలికింది. ఆలయం, శివలింగం పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదని అంటున్నారు. హిందు సంస్థలు, బీజేవైఎం, బీజేపీ, వీహెచ్‌పీ ఘాటుగా స్పందించాయి.
శివలింగం ముందు తాళ్లు కట్టినది వీడియో స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరూ చెప్పారో తెలియదు కానీ ఆ భగవంతుడి పట్ల తప్పుగా ప్రవర్తించారు. తీరు మార్చుకోవాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. పాపం పండిందని అంటున్నారు. వెంటనే తొలగించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో జగనన్న చేయూత కార్యక్రమానికై జరిగిన ఏర్పాట్లలో అతి పురాతనమైన గోలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించారు. (1/2) pic.twitter.com/IEJwD7V6Pc
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) September 25, 2022
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications