తూర్పుగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏమీ రిజిష్ట్రార్.. అటెండర్‌ను వదలవా.. లైంగికవేధింపుల కేసు

|
Google Oneindia TeluguNews

పనిచేసే చోట కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదు. కొందరు మహిళలకు హరాస్‌మెంట్ ఎక్కువ అవుతుంది. కొన్ని చోట్ల ఉన్నత ఉద్యోగులు కూడా తప్పుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో అలాంటి ఘటన ఒకటి వెలుగుచూసిది. ఏలూరు రిజిస్టార్ కార్యాలయంలో సబ్ రిజిష్టార్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. ఇదీ కలకలం రేపింది.

రిజిస్టార్ కార్యాలయంలో జయరాజు అనే వ్యక్తి సబ్ రిజిష్టార్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్నత ఉద్యోగం కానీ.. గుణమే బాగోలేదు. అదే ఆఫీస్ ఆడిట్ సెక్షన్‌లో అటెండర్‌గా వివాహిత పనిచేస్తోంది. ఆమెపై జయరాజు కన్నుపడింది. ఇంకేముంది ఆమెను వేధించడం ప్రారంభించారు. కింది స్థాయి ఉద్యోగి కదా అని హరాస్ చేయడం ప్రారంభించారు. దీంతో ఆమె తట్టుకోలేకపోయింది.

sexual harassment case registered against sub registrar

జయరాజు గతకొద్ది రోజులుగా తన కోరిక తీర్చాలని వేధిస్తున్నాడని వాపోయింది. చివరికీ పోలీసులను ఆశ్రయించింది. జయరాజు వేధింపుల గురించి సదరు మహిళా ఉద్యోగిని జిల్లా రిజిస్టార్‌కి తెలపగా అధికారులు అతన్ని మందలించారు. అతని ప్రవర్తనలో మార్పు రాకపోగా తన కోరిక తీర్చకపోతే ప్రాణహాని తలపెడతానని జయరాజు బెదిరింపులకి పాల్పడ్డాడు. అధికారుల సూచనల మేరకు సదరు వివాహిత దిశా పోలీస్టేషన్‌లో అతనిపై పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసును దిశ పోలీసులు టేకాఫ్ చేశారు. ఎంక్వైరీ జరుగుతుందని వివరించారు. సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని వివాహిత కోరుతుంది. తనకు మానసికంగా ఒత్తిడికి గురిచేశాడని వాపోయింది. నిర్భయ, అభయ లాంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. కొందరిలో మార్పు రావడం లేదు. తమకేంటి అన్నట్టు వారు బిహెవ్ చేస్తున్నారు. జయరాజు కూడా.. మంచి ఉద్యోగంలో ఉండి.. చిల్లర బుద్దిని ప్రదర్శించాడు.

English summary
sexual harassment case registered against eluru sub registrar jayaraju. he harass attender.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X