ఉసిరిచెట్టులో శ్రీమహావిష్ణువు కొలువై ఉండే పవిత్ర ఏకాదశి- ఈ పనులు చేయాలి

సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతానికి విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ వ్రతాలలో అమాలకీ ఏకాదశి ఒకటి. దీనిని రంగ్ భరి ఏకాదశి లేదా ఫాల్గుణ శుక్ల ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ వ్రతం భక్తి, వైరాగ్యం, మోక్షాలకు ప్రతీక. ఈ దినాన శ్రీ విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉసిరి చెట్టును పూజించడం పుణ్యప్రదం. ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు ఉసిరిచెట్టులో కొలువుదీరి ఉంటాడని అశేష భక్తుల విశ్వాసం. అందుకే దీనికి అమాలకీ ఏకాదశిగా పూజిస్తారు. ఆమ్లా అంటే ఉసిరి. ఈ రోజున ఉసిరిచెట్టును పూజించడం, సేవించడం, దానం చేయడం వల్ల వ్యాధులు నశిస్తాయి. పాపాలు దూరమౌతాయి. జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయి.

ఈ నెల 27వ తేదీన శుక్రవారం నాడు అమాలకీ ఏకాదశి వ్రతం వచ్చింది. దృక్ పంచాంగ్ ప్రకారం ఫాల్గుణ శుక్ల ఏకాదశి తిథి 27న అర్ధరాత్రి దాటిన తర్వాత 12:33 నిమిషాలకు ప్రారంభమై, అదే రోజు రాత్రి 10:32 వరకు ఉంటుంది. ఉదయ తిథి ఆధారంగా అదేరోజు అమాలకీ ఏకాదశి వ్రతం పాటిస్తారు. ఈ రోజునే రంగ్ భరి ఏకాదశిని కూడా జరుపుకొంటారు. అమాలకీ ఏకాదశి పారణ 28న తెల్లవారు జామున 6:47 నుండి 9:06 వరకు చేయవచ్చు.

Amalaki Ekadashi Phalguna Shukla Paksha Significance and Puja Steps Date Timings and Rituals

నాలుగు శుభ యోగాలు

ఈసారి అమాలకీ ఏకాదశి నాడు నాలుగు శుభ యోగాలు- సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం, ఆయుష్మాన్ యోగం, సౌభాగ్య యోగం ఏర్పడనున్నాయి. ఈ పవిత్ర యోగాలలో చేసే పూజలు, దానధర్మాలు అనేక రెట్లు అధిక ఫలితాలను ఇస్తాయని భక్తులు విశ్వసిస్తారు.

అమాలకీ ఏకాదశి పూజ విధి..

తెల్లవారుజామునే స్నానం చేసి, వ్రత సంకల్పం తీసుకోవాలి. అనంతరం దీపం, ధూపం, పుష్పాలు, ఫలాలు, తులసి పత్రాలతో శ్రీ విష్ణుమూర్తికి విధి విధానంగా పూజలు చేయాలి. ఉసిరి చెట్టుకు జలధార సమర్పించాలి. దాని కింద దీపారాధన చేయాలి. ఆపై విష్ణుసహస్రనామాలను జపించాలి. వీలు లేనివారు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మంత్రాన్ని జపించాలి. రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం హారతి తర్వాత ప్రసాదం స్వీకరించాలి.

ఏకాదశి నాడు చేయవలసినవి:

ఉసిరితో చేసిన వంటకాలు, పండ్లు, మఖానా ఖీర్, సగ్గుబియ్యం వంటలు, కొబ్బరి/నెయ్యితో చేసిన మిఠాయిలను నైవేద్యంగా సమర్పించడం శుభప్రదం. పండ్లు, వస్త్రాలు, ధాన్యం, ఉసిరి దానం చేయాలి. పేదలకు భోజనం పెట్టి, తులసి లేదా ఉసిరి మొక్కలను నాటడం శుభకరం.

చేయకూడనివి:

ఏకాదశి రోజున బియ్యం, పప్పులు, మాంసం, మద్యపానం సేవించకూడదు. కోపం, అబద్ధాలు, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. పగటిపూట నిద్రపోవడం, వెంట్రుకలు కత్తిరించుకోవడాన్ని కూడా ఈ రోజున నిషేధిస్తారు. నియమ నిష్ఠలు, భక్తిశ్రద్ధలతో చేసే వ్రతం మోక్ష మార్గాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

రంగ్ భరి ఏకాదశికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు శ్రీ శివపార్వతులకు సంబంధించినదిగా భావిస్తారు. వివాహం అనంతరం ఇదే రోజున మాతా పార్వతి గృహ ప్రవేశం చేసిందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా వారణాసిలోని భక్తులు, శివపార్వతులకు గులాల్ సమర్పించడం ద్వారా ఈ రోజును ఉత్సవంగా జరుపుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+