health tips: ఉదయం ఖాళీకడుపుతో ఈ పదార్ధాలు తింటున్నారా? అయితే అనారోగ్యం తెచ్చుకున్నట్టే!!

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ప్రస్తుత సమాజంలో ఆరోగ్యం కోసం ఆసుపత్రుల చుట్టూ పరుగులు పెడుతున్నారు. మనం అనారోగ్యం బారిన పడటానికి మన జీవన శైలి కారణమని వైద్యులు చెబుతున్నారు. మన జీవితం మనం తీసుకునే ఆహారం పైన, మన అలవాట్ల పైన ఆధారపడి ఉంటుంది. సరైన ఆహారపు అలవాట్లు లేనివారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. మెరుగైన ఆరోగ్యం కావాలనుకునేవారు ఒక క్రమబద్ధమైన జీవితాన్ని అలవర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

 పరగడుపున ఏది పడితే అది తింటే అనారోగ్యం

పరగడుపున ఏది పడితే అది తింటే అనారోగ్యం

ఇక ఆహారపు అలవాట్లు విషయానికి వస్తే చాలా మంది ఉదయం లేచిన తర్వాత ఖాళీకడుపుతో తినకూడని పదార్థాలు అన్నిటినీ తింటూ ఉంటారు. ఇక అలా ఏది పడితే అది తింటే అనారోగ్యం బారిన పడతారని వైద్యులు సూచిస్తున్నారు. వైద్య నిపుణుల సూచనల ప్రకారం ఎట్టి పరిస్థితులలోనూ ఉదయం పరగడుపున కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల కచ్చితంగా అనారోగ్యం బారిన పడతారు. ముఖ్యంగా వైద్యులు సూచిస్తున్న పలు ఆహారపదార్థాల విషయానికి వస్తే..

లేచిన వెంటనే కాఫీలు, టీలు త్రాగుతున్నారా? అయితే కష్టమే

లేచిన వెంటనే కాఫీలు, టీలు త్రాగుతున్నారా? అయితే కష్టమే


కొంతమందికి ఉదయం లేచిన వెంటనే కాఫీలు, టీలు అలవాటు ఉంటుంది. అయితే ఉదయం పరగడుపున కాఫీలు, టీలు తాగే అలవాటు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. అలా పరగడుపున కాఫీ, టీలు తాగడం వల్ల బాడీ డీహైడ్రేడ్ అవుతుందని చెప్తున్నారు. ఇక డయాబెటిస్, బీపీ వంటి సమస్యలు ఉన్నవారు కూడా ఉదయం కాఫీలు, టీలు త్రాగటం మంచిది కాదని సూచిస్తున్నారు. ఒకవేళ అలా చేస్తే వారి అనారోగ్య సమస్యలు మరింత పెరుగుతాయని చెప్తున్నారు.

 వేయించిన పదార్ధాలు, మసాలాలతో తయారు చేసిన ఆహారం తీసుకుంటే ఆ సమస్య

వేయించిన పదార్ధాలు, మసాలాలతో తయారు చేసిన ఆహారం తీసుకుంటే ఆ సమస్య


ఉదయం పరగడుపున వేయించిన పదార్థాలు, మసాలాలతో తయారు చేసిన పదార్థాలు తీసుకోకూడదు. అలా మసాలాలతో తయారు చేసిన పదార్థాలను తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య వస్తుంది. కడుపులోని, ఛాతిలోనూ బరువుగా అనిపించడంతోపాటు మంటగా కూడా అనిపిస్తుందని జీర్ణకోశ సమస్యలు వస్తాయని చెప్తున్నారు. అందుకే ఉదయం మసాలాలతో తయారు చేసిన పదార్థాలను తీసుకోకూడదు అని చెబుతున్నారు.

చల్లని నీరు త్రాగటం , పీచు పదార్ధాలు బాగా తినటం డేంజర్

చల్లని నీరు త్రాగటం , పీచు పదార్ధాలు బాగా తినటం డేంజర్


ఉదయం పరగడుపున పీచు పదార్ధాలు ఎక్కువ తీసుకోవటం మంచిది కాదు. పీచు పదార్ధాలు శరీరానికి మంచివే అయినా, అతిగా తీసుకోవటం అనర్ధాలకు కారణం అవుతుంది అని చెప్తున్నారు. ఇక ఉదయం పూట లేవగానే మంచినీరు త్రాగటం మంచిది కానీ చల్లని నీటిని త్రాగటం మంచిది కాదని చెప్తున్నారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్తున్నారు. వీలైతే ఉదయం గోరువెచ్చని నీటిని త్రాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

లేవగానే ఆల్కాహాల్ తాగితే.. ఆస్పత్రి పాలవటం పక్కా

లేవగానే ఆల్కాహాల్ తాగితే.. ఆస్పత్రి పాలవటం పక్కా


ఇక కొందరికి ఉదయం లేవగానే స్మోక్ చెయ్యటం, డ్రింక్ చెయ్యటం వంటి చెడు వ్యసనాలు ఉంటాయి. అవి ఏ మాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు. ఉదయం లేవగానే ఆల్కాహాల్ సేవించే వారు త్వరగా ఆస్పత్రి పాలవుతారని చెప్తున్నారు. ఉదయం లేవగానే ఆల్కాహాల్ తీసుకుంటే అది డైరెక్ట్ గా కాలేయంపైన ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. ఏం తినాలి, ఏమి తినకూడదు అనేది తెలుసుకుని తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకున్నవాళ్ళం అవుతామని చెప్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+