వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: విపరీతమైన పొడిదగ్గుతో బాధపడుతున్నారా? అయితే ఈ నేచురల్ రెమిడీస్ మీ కోసమే!!

|
Google Oneindia TeluguNews

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉత్పన్నమైనప్పుడు ఆదిలోనే దానిని తగ్గించే పరిష్కారం వెతకాల్సి ఉంటుంది. అలా కాకుండా అదే తీవ్రతరం అయిన తరువాత ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండదు. అటువంటి అనారోగ్య సమస్యలతో పొడి దగ్గు ఒకటి.

శీతాకాలంలో వేధించే సమస్యలలో దగ్గు ఒకటి

శీతాకాలంలో వేధించే సమస్యలలో దగ్గు ఒకటి

సాధారణంగా చాలా మందికి వాతావరణంలో మార్పులు జరిగినప్పుడల్లా దగ్గు వస్తూ ఉంటుంది. చాలా మందిని పొడి దగ్గు వేధిస్తూ ఉంటుంది. ఎన్ని సిరప్ లు తాగినా దగ్గు మాత్రం కంట్రోల్ కాదు. ఇక శీతాకాలంలో అయితే పొడి దగ్గు సమస్య దాదాపు చాలా మందిని వేధిస్తోంది అందుకే ఈ సీజన్లో దగ్గుతో బాధపడేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దగ్గు తగ్గడం కోసం ఏం చేయాలి? ఎటువంటి నేచురల్ రెమెడీస్ మనకు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి వంటి అనేక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పొడిదగ్గుకు బెస్ట్ ఇంటి చిట్కాలు ఇవే

పొడిదగ్గుకు బెస్ట్ ఇంటి చిట్కాలు ఇవే

శీతాకాలంలో వాతావరణ మార్పుల వల్ల, శీతల పానీయాలను తాగడం వల్ల చాలామంది దగ్గుతో ఇబ్బంది పడతారు. ఇక అటువంటి వారు తీసుకోవలసిన జాగ్రత్తల విషయాలకు వస్తే విపరీతంగా దగ్గుతో ఇబ్బంది పడుతున్న వారికి తులసి మంచి ఔషధంగా పనిచేస్తుంది. నీళ్ళలో తులసి ఆకులు వేసి మరిగించి, ఆ తర్వాత మరిగిన తులసి నీటిని కాస్త చల్లార్చి తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం వస్తుందని చెబుతారు. మరిగించకుండా తులసి ఆకులను నేరుగా తీసుకున్నప్పటికీ దగ్గు నుండి రిలీఫ్ లభిస్తుంది. అంతేకాదు పాలల్లో మిరియాల పొడి వేసి తాగడం వల్ల దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.

ఈ చిన్న చిట్కాలతో దగ్గు నుండి బిగ్ రిలీఫ్

ఈ చిన్న చిట్కాలతో దగ్గు నుండి బిగ్ రిలీఫ్

తమలపాకులు నమలడం వల్ల కూడా పొడి దగ్గు నుండి మంచి రిలీఫ్ లభిస్తుంది. కరక్కాయ పొడి దగ్గును తగ్గించటంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. కొంచెం గోరువెచ్చని నీళ్లలో కరక్కాయ పొడిని కలుపుకుని తాగినా, కరక్కాయ ముక్క బుగ్గన పెట్టుకుని ఆ రసాన్ని మింగుతూ ఉన్నాపొడి దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. పొడి దగ్గు ఉన్నవారు అల్లం టీ ని తీసుకోవడం వల్ల దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు పొడి దగ్గు తగ్గాలంటే నిమ్మరసం, తేనె, చిటికెడు పసుపు కలిపిన మిశ్రమాన్ని కూడా మూడు పూటలా తీసుకుంటే ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

దగ్గు నుండి ఉపశమనం పొందండి ఇలా

దగ్గు నుండి ఉపశమనం పొందండి ఇలా

అర టీ స్పూన్ సొంఠి పొడి లో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకున్నా దగ్గు నుంచి ఉపశమనం దొరుకుతుంది అని చెబుతున్నారు. ఇక దగ్గుతో బాధపడేవారు రాత్రి సమయాల్లో విపరీతమైన ఇబ్బందిని ఎదుర్కొంటారు. అలాంటి వారు రాత్రి సమయాల్లో తలకింద ఎత్తు ఎక్కువ పెట్టుకొని పడుకోవడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
It is said that those suffering from extreme dry cough should take the juice of Tulsi leaves, Karakkaya powder will give relief, take milk with pepper powder, use dry ginger and honey, ginger lemon juice with honey will also give results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X