వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: ముడతలు మాయమై ముఖం సహజకాంతితో మెరిసిపోవాలా? అయితే ఇవి ట్రై చెయ్యండి!!

|
Google Oneindia TeluguNews

టీ అనేది మానవ జీవితంలో భాగమైపోయింది. చాలా మంది టీ తాగకుంటే అస్సలు ఉండలేరు. పాలు, పంచదారతో తయారు చేసిన టీ ల కంటే హెర్బల్ టీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. హెర్బల్ టీలు ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా చాలా మేలు చేస్తాయి. హెర్బల్ టీ ఇది టీ ఆకులు మరియు వైద్యం చేసే మూలికల మిశ్రమం, ఇది మీ ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. శీతాకాలం ప్రారంభంలో, మారుతున్న సీజన్‌లో, మీరు ప్రతిరోజూ ఒక కప్పు హెర్బల్ టీ తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అని పలువురు నేచురోపతి వైద్యులు చెబుతున్నారు. మార్కెట్లో రకరకాల హెర్బల్ టీ పౌడర్లు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు.

యాంటీ ఏజింగ్ లక్షణాలు తగ్గించే హెర్బల్ టీలు

యాంటీ ఏజింగ్ లక్షణాలు తగ్గించే హెర్బల్ టీలు

హెర్బల్ టీలు వల్ల యాంటీ ఏజింగ్ లక్షణాలు తగ్గుతాయి అని చెబుతున్నారు. ముఖ్యంగా గులాబీపూలు, మందార వంటి పూలతో తయారు చేసిన హెర్బల్ టీల వల్ల శరీరం సహజసిద్ధమైన కాంతిని సంతరించుకుంటుందని చెబుతున్నారు. మీకు సహజమైన గ్లో కావాలంటే, మీ ఆహారంలో హెర్బల్ టీని ఖచ్చితంగా ఒక భాగం చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. హెర్బల్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల వృద్ధాప్యాన్ని తగ్గించవచ్చు. ఇది మీ అనేక చర్మ సమస్యలను కూడా నయం చేస్తుందని చెబుతున్నారు.

జీవక్రియ మెరుగుపరచడానికి హెర్బల్ టీలు ఎంతో ఉపయోగం

జీవక్రియ మెరుగుపరచడానికి హెర్బల్ టీలు ఎంతో ఉపయోగం

హెర్బల్ టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. పిప్పరమింట్, హెర్బల్ టీలలో ఒక పదార్ధం, ఆకలిని అణిచివేస్తుంది. అంతేకాకుండా అతిగా తినాలనే కోరికను తగ్గిస్తుంది. కొవ్వును తగ్గించడంతో పాటు, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, వాంతులు వంటి అనారోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా హెర్బల్ టీలు సహాయపడతాయి. జీలకర్ర, ధనియాలు, సోంపు తదితర వస్తువులను ఉపయోగించి చేసిన హెర్బల్ టీలు ఎంతో జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తాయని చెప్తున్నారు.

ఒత్తిడి తగ్గించే హెర్బల్ టీలు

ఒత్తిడి తగ్గించే హెర్బల్ టీలు

ఒత్తిడిని తగ్గించడంతో పాటు, నిద్రలేమి నివారించడానికి కూడా, హెర్బల్ టీలు గొప్పగా పనిచేస్తాయి. నిద్రలేమితో బాధపడుతున్న చాలా మందికి పడుకునే ముందు హెర్బల్ టీ తాగడం తరచుగా సిఫార్సు చేయబడింది. హెర్బల్ టీలలో యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. హెర్బల్ టీలు తాగుతున్న వారు పలు రకాలైన జబ్బులతో మరియు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అవి ఆక్సీకరణ ఒత్తిడి నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

శరీరం నుంచి టాక్సిన్లను బయటకు పంపించడంలో హెర్బల్ టీల పాత్ర గణనీయం

శరీరం నుంచి టాక్సిన్లను బయటకు పంపించడంలో హెర్బల్ టీల పాత్ర గణనీయం

ఆరోగ్యంగా ఉండేందుకు డిటాక్సిఫికేషన్ అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. హెర్బల్ టీ మీ శరీరం నుండి టాక్సిన్ లను బయటకు పంపడం ద్వారా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో, ప్రతిరోజూ ఒక కప్పు హెర్బల్ టీని త్రాగటం మంచిదని సూచించబడింది. హెర్బల్ టీలు టాక్సిన్స్ ను బయటకు పంపడంలో బాగా సహాయపడుతాయి. కిడ్నీ, లివర్ మీద ఒత్తిడి తగ్గించి అక్కడ పేరుకున్న టాక్సిన్స్ ను బయటకు పంపిస్తాయి.

ఏ హెర్బల్ టీ దేనికోసం పని చేస్తుందంటే

ఏ హెర్బల్ టీ దేనికోసం పని చేస్తుందంటే

గ్రీన్ టీ, హైబిస్కస్ టీ టాక్సిన్స్ ను బయటకు పంపటానికి బాగా పనిచేస్తాయి. అంతేకాదు తలనొప్పి నుండి ఆర్థరైటిస్ వరకు అనేక సమస్యలను, కడుపులో మంట వంటి అనేక సమస్యలను అల్లం టీ లేదా పసుపు టీ తో తగ్గించవచ్చని చెబుతున్నారు. కొన్ని హెర్బల్ టీలు నొప్పిని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తాయని సూచిస్తున్నారు. చామోమిల్, యూకలిప్టస్ టీ లు ఇందుకు బాగా పనిచేస్తాయని చెబుతున్నారు. ఇక నిద్రలేమిని, యాంగ్జైటీని తగ్గించి, హాయిగా నిద్ర పట్టేలా చేయడంలో కొన్ని రకాల హెర్బల్ టీలు బాగా పనిచేస్తాయని సూచిస్తున్నారు. చామోమిల్ టీ, లావెండర్ టీ ఇందుకు బాగా పని చేస్తాయని అంటున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
If you want to get rid of wrinkles and aging, and have a natural glow on your face, naturopathic doctors suggest you to try herbal teas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X