గ్రహాలను శాసించే అమ్మోరు: ఈ గుడికి ఒక్కసారి వెళ్లొస్తే జాతక దోషాలు తొలగిపోతాయ్..!!
ఢిల్లీ దక్షిణ ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన కాళికా దేవి అమ్మవారి ఆలయం కొలువై ఉంది. ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల జాతక దోషాలు, కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ ప్రత్యేకమైన ఆలయంలో 12 ద్వారాలు ఉండటం విశేషం. ఈ ద్వారాలు 12 రాశులను సూచిస్తాయని చెబుతారు. గ్రహణ సమయంలోనూ తెరిచి ఉండే కొన్ని ఆలయాలలో ఇదీ ఒకటి. పురాతన సిద్ధ పీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. కాళీ దేవి మరో రూపమైన కల్కా పేరుతో ఈ ఆలయాన్ని పిలుస్తారు. 'జయంతి పీఠ్' 'మనో కామ్నా సిద్ధ పీఠ్' అని కూడా పిలుస్తారు.
పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించారని ఐతిహ్యం. సాధారణంగా గ్రహణ సమయంలో గర్భగుడిలోని దేవతలకు పూజలు జరగవు. అప్పుడు ఆలయాలన్నింటినీ పూర్తిగా మూసివేస్తారు. శ్రీకాళహస్తి వంటి కొన్ని ఆలయాలు మాత్రమే గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉంటాయి. అటువంటి వాటిలో ఇదీ ఒకటి.

కల్కా మాత ఆలయంలో 12 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఏ రాశిచక్రం వారు ఈ ద్వారం గుండా వెళ్తే వారి జాతక దోషాలు, ఇతర సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ 12 ద్వారాలు 12 నెలలు, 12 రాశిచక్రాలను సూచిస్తాయి. ఆలయం ప్రతి ద్వారం వద్ద అమ్మవారి విభిన్న చిత్రాలను చూడొచ్చు. గ్రహణ సమయంలో అన్ని గ్రహాలు కాళీ దేవి ప్రభావంలో ఉంటాయని నమ్ముతారు. ఈ కారణంగానే కాళీ అమ్మవారి ఆలయం గ్రహణ వేళల్లో కూడా తెరిచి ఉంటుంది.
సాధారణ రోజుల్లో.. ఈ ఆలయంలో వేదాలు, పురాణాలు, తంత్ర విధానాలను ఉపయోగించి పూజలు నిర్వహిస్తారు. నవరాత్రి సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది రకాల ఆభరణాలతో అలంకరిస్తారు. నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం కోసం వివిధ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తారీ ఆలయానికి.
తెల్లవారు జామున 5 గంటలకు సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలుపుతారు. 5:30 నుండి 6:30 వరకు అలంకరణ సమయం. ఈ గంట పాటు ఆలయం మూసి ఉంటుంది. 6:30 గంటలకు హారతి మొదలవుతుంది. అరగంట పాటు కొనసాగుతుంది. ఆ సమయంలో కాళీ దేవి మంత్రోచ్ఛారణలతో ఆలయం మార్మోగిపోతుంది. 11:45 నుండి 12:15 నిమిషాల వరకు ఆలయాన్ని మూసివేస్తారు. మధ్యాహ్నం 12:00 గంటలకు అన్న సంతర్పణ మొదలవుతుంది. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు మూసివేస్తారు.
మళ్లీ సాయంత్రం 7 గంటలకు గణేషుడి వందనంతో ఆలయాన్ని తెరుస్తారు. 7:30 నుండి 8:30 వరకు ఆరాధన సమయం ఉంటుంది. రాత్రి 8:30 నుండి 9:00 గంటల వరకు హారతి ఇస్తారు. అనంతరం తలుపులు మూసివేస్తారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉందీ కల్కాజీ ఆలయం. కాశ్మీరీ గేట్ బస్ టెర్మినల్ నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications