శక్తిమంతమైన కార్తిక అమావాస్య: చేయాల్సిన పనులు ఇవే..

కార్తీక అమావాస్య రెండురోజుల పాటు జరుపుకోనున్నారు. బుధ, గురువారాల్లో ఆచరించనున్నారు. మిగులు అమావాస్య గురువారం ఉంటుంది. దీన్ని అమావాస్య అని కూడా పిలుస్తారు. మన పూర్వీకులను స్మరించుకోవడానికి, వారిని పూజించడానికి కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి, పితృదోషంతో బాధపడుతున్న వారు ఈ రోజున వివిధ ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలి.

శుభ ముహూర్తం

దృక్ పంచాంగం ప్రకారం.. మార్గశిర మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తిథి ఈ ఉదయం 9:43 నిమిషాలకు ప్రారంభమౌతుంది. గురువారం మధ్యాహ్నం 12:16 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, కార్తీక అమావాస్యను గురువారం నాడు ఆచరిస్తారు. కొందరు మాత్రం అమావాస్య తిథి ప్రకారం నేడే దీన్ని జరుపుకొంటారు. కార్తీక అమావాస్య నాటి బ్రహ్మ ముహూర్తాన్ని అత్యంత శక్తిమంతమైనదిగా పరిగణిస్తారు. తెల్లవారు జామున 5:01 నుండి 5:54 నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో పవిత్ర నదీ స్నానాలు చేయడం, దానధర్మాలు చేయడం శ్రేష్ఠమని పండితులు సూచిస్తున్నారు.

పూజా విధానం

కార్తీక మాసపు అమావాస్య నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, స్నానం చేయాలి. నదీ స్నానం సాధ్యం కానివారు నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకొని స్నానం చేయవచ్చు. అనంతరం రాగి పాత్రలో నీరు, కొద్దిగా పాలు, సింధూరం, ఎర్రటి పువ్వులు కలిపి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.

పూజ ప్రారంభించడానికి ముందు, పూజా స్థలంలో ఒక చెక్క పీటపై పసుపు రంగు వస్త్రాన్ని పరవాలి. దానిపై లక్ష్మీదేవి, నారాయణుడి విగ్రహాలను లేదా చిత్రాలను ఉంచాలి. పువ్వులు, పూలమాలలు, పసుపు చందనం, అక్షతలతో నైవేద్యాలు సమర్పించాలి. నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. శివ కేశవులను స్మరిస్తూ పూజలు చేయాలి.

తర్పణం

పూజ తర్వాత, అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణం వదలాలి. గంగాజలాన్ని వినియోగించడం అత్యంత శ్రేష్టం. అది సాధ్యం కాని వాళ్లు నీరు, నల్ల నువ్వులు, పచ్చి పాలను రాగి లేదా ఇత్తడి పాత్రలో కలిపి శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. దక్షిణం వైపు ముఖం చేసి కూర్చుని, చేతిలో నీరు తీసుకుని, సంకల్పం చెప్పుకుని, మీ పూర్వీకులను స్మరిస్తూ నీటిని సమర్పించాలి. "ఓం పితృ దేవతాయై నమః" అనే మంత్రాన్ని జపించాలి. చివరగా, అవసరమైన వారికి ఆహారం లేదా ఆహార పదార్థాలను దానం చేయాలి.

అలాగే, సాయంత్రం తులసికోట దగ్గర పిండి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో శాంతి, సంతోషం నెలకొంటాయని, పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+