పితృ పక్షాలు ఎప్పుడు: మహాలయ అమావాస్య తేదీ, ఈ కాలంలో చేయాల్సినవి

హిందూ ధర్మంలో పితృ పక్షానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. తమ వంశాభివృద్ధికి కారణమైన పూర్వీకులను భక్తిశ్రద్ధలతో స్మరించుకుంటూ వారికి తర్పణం వదలడానికి, భక్తిశ్రద్ధలతో శ్రాద్ధకర్మలు ఈ సమయం ఎంతో అనుకూలం. ప్రతి ఏటా భాద్రపద మాస పూర్ణిమతో ప్రారంభమై ఆశ్వయుజ అమావాస్యతో ముగిసే ఈ 16 రోజుల కాలంలో పితృ దేవతల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సంవత్సరంలో ఈ శ్రాద్ధ పూజల కాలం ఈ నెల 26వ తేదీ శనివారం ప్రారంభం కానుంది. అక్టోబర్ 10వ తేదీ శనివారంతో ముగియనుంది.

ఈ పితృ పక్షాల సమయంలో స్వర్గస్థులైన మన పూర్వీకులు సూక్ష్మ రూపంలో భూలోకానికి విచ్చేస్తారని పురాణాలు చెప్తున్నాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులు ఆచరించే తర్పణాలు, పిండ ప్రదానాలు వారి ఆత్మలకు సంపూర్ణ శాంతిని చేకూరుస్తాయి. పూర్వీకులు తృప్తి చెందితే ఆ కుటుంబాలపై వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి, సుఖసంతోషాలు చేకూరుతాయని భక్తుల బలమైన నమ్మకం. ప్రతి సంవత్సరం మన పెద్దలు ఏ తిథి రోజున మరణించారో, ఈ పక్షంలో అదే తిథి రోజున వారికి తర్పణాన్ని సమర్పిస్తారు.

Pitru Paksha is considered an important period for remembering and honouring ancestors on Sept 26

శాస్త్ర నియమాల ప్రకారం పితృ కార్యాలు, శ్రాద్ధ కర్మలను ఎల్లప్పుడూ మధ్యాహ్నం వేళలోనే నిర్వహించాలి. శాస్త్ర పరిభాషలో దీనిని కుతూప కాలం అంటారు. ఉదయం లేదా సాయంత్ర సమయాలలో శ్రాద్ధాన్ని నిర్వహించడం సరికాదని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రాద్ధ తర్పణాల క్రతువులో దర్భ, నల్ల నువ్వులు, గంగాజలం ఖచ్చితంగా ఉపయోగించాలి. ఈ పూజ చేసే వారు దక్షిణ దిశ వైపు ముఖం చేసి పితృ దేవతలకు శ్రద్ధగా జలతర్పణాన్ని సమర్పించాల్సి ఉంటుంది.

వాస్తు ప్రకారం.. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచకూడని వస్తువులు
వాస్తు ప్రకారం.. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచకూడని వస్తువులు

పూజా విధానం పూర్తయిన తర్వాత తయారు చేసిన సాత్విక భోజనంలో మొదటి భాగాన్ని పంచబలి రూపంలో ఆవు, కుక్క, కాకి, దేవతలు, చీమలకు సమర్పించాలి. ముఖ్యంగా కాకిని యమధర్మరాజు వాహనంగా, పితృ దేవతల దూతగా భావిస్తారు. అందుకే కాకికి పిండం పెట్టడం అత్యంత ముఖ్యం. అనంతరం శ్రద్ధతో బ్రాహ్మణుడికి భోజనం పెట్టి, వస్త్రాలు, దక్షిణలు సమర్పించి సత్కరించి పంపడం వల్ల పితృ దోషాల సంపూర్ణ నివారణ జరుగుతుంది. భోజనం పెట్టడం కుదరకపోతే దానికి అవసరమైన బియ్యం, అయిదురకాల కూరగాయలను దక్షిణగా సమర్పించాలి.

వాస్తు ప్రకారం.. మంచం కింద ఎంత మాత్రం ఉంచకూడని వస్తువులు
వాస్తు ప్రకారం.. మంచం కింద ఎంత మాత్రం ఉంచకూడని వస్తువులు

కొంతమందికి తమ పూర్వీకుల మరణ తిథి కచ్చితంగా తెలియకపోవచ్చు. అటువంటి వారు అక్టోబర్ 10వ తేదీన వచ్చే సర్వపితృ అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలు పూర్తి చేయవచ్చని శాస్త్రాలు సూచిస్తోన్నాయి. చివరి రోజైన సర్వపితృ అమావాస్య నాటి రాత్రి ఇంటి ప్రధాన ద్వారం వెలుపల దీపం వెలిగించి పితృ దేవతలకు వీడ్కోలు పలకాలి. సనాతన ధర్మం ప్రకారం మనుషులపై ఉండే దేవ, రుషి రుణాలతో పాటు పితృ రుణం కూడా అత్యంత ముఖ్యమైనది.

వాస్తు ప్రకారం.. ఇంట్లో మూడు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ వాడవచ్చా?
వాస్తు ప్రకారం.. ఇంట్లో మూడు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ వాడవచ్చా?

శ్రాద్ధ కర్మల ద్వారా పూర్వీకుల ఆశీస్సులు లభించి, కుటుంబంలో సుఖసంతోషాలు, మానసిక ప్రశాంతత పెంపొందుతాయి. భక్తిప్రపత్తులతో ఈ విధులను నిర్వర్తించడం వల్ల పూర్వీకుల రుణం తీరడమే కాకుండా, కుటుంబంలో సకాలంలో వివాహాలు కావడం, సంతాన ప్రాప్తి కలగడం వంటి ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయని వేదపండితులు తెలియజేస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+