Vikram-Betaal story: బేతాళుడు చెప్పిన కథ..విక్రముడి సమాధానం ఇదే..!!

నిన్నటి తరం పిల్లలను నిద్రపుచ్చాలంటే అమ్మమ్మ లేదా తాతయ్యలు రాత్రి వేళల్లో కథలు చెప్పేవారు. లేదా తల్లిదండ్రులు జోలపాటలు పాడి నిద్రపుచ్చేవారు. ఇక ఆ పిల్లలు కాస్త పెద్దయ్యాక కొన్ని పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసేవారు. అందులో చందమామ పుస్తకం ఎప్పటికీ మరవలేము. అందులో వచ్చే కథలు మనస్సుకు ఆనందాన్ని,ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. చదువుతున్నంత సేపు సమయం తెలీకుండా పోతుంది. అయితే నేటి తరం పిల్లలు మాత్రం స్మార్ట్ ఫోన్‌కు బానిసయ్యారు. దీంతో అలనాటి చందమామ కథలకు దూరమైపోతున్నారు. అలాంటి కథలు తిరిగి పాఠకులకు గుర్తు చేయాలని భావించి వన్‌ఇండియా చేస్తున్న చిరు ప్రయత్నం ఇది. ఇందులో భాగంగా సోందేవ్ భట్ రచించిన విక్రమ్-బేతాళుడి కథ గురించి తెలుసుకుందాం.

ఎప్పటిలాగే విక్రమాదిత్యుడు బేతాళున్ని తాను ఉన్న చెట్టుపై నుంచి భుజంపై మోసుకొస్తున్నప్పుడు ఆ బేతాళుడు ఒక కథ చెప్పుకొచ్చాడు. "విక్రమాదిత్యా నువ్వు గొప్ప వీరుడివి.నేను నీకొక ధైర్యశాలి అయిన ఒక పిల్లవాడి గురించి చెబుతాను" అని కథ చెప్పడం ప్రారంభించాడు.అనగనగా ఒక రాజు. ఆ రాజు పేరు జైరాజన్.తన బంధువులకు రాజ్యంపై కన్నుపడి తనను చంపి, ఆ రాజ్యంను చేజిక్కించుకోవాలనే పన్నాగం పన్నినట్లు జైరాజన్ అనే ఈ రాజుకు తెలిసింది.బంధువులతో యుద్ధం ఎందుకు, రక్తపాతం ఎందుకు అని భావించిన జైరాజన్ తన రాజ్యాన్ని వారికి అప్పగించి తాను ఎక్కడో దూరంగా ఓ గ్రామంకు వెళ్లిపోయాడు.అక్కడే ఒక అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకుని జీవితాన్ని ఆనందంగా గడపసాగాడు.

Oneindia s Kids Mythology Betaal Challenges Vikram with a Tale of Bravery

ఒక రోజు తను పనినిమిత్తమై వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా.. మనిషికి సంబంధించిన ఎముకలు దారి మధ్యలో పడి ఉండటాన్ని గమనించాడు.షాక్‌కు గురైన జైరాజన్ ఇంటికి పరుగులు తీసి విషయాన్ని భార్యకు చెప్పాడు.ఇది విన్న భార్య రాజుతో ఇలా అంది"క్రూరుడైన ఆ రాజ్యపు రాజు గరుడ అనే గద్ద కోసం రాజ్యంలోని అబ్బాయిలను ప్రాణాలు తీసి ప్రాణత్యాగంగా చెప్పుకుంటున్నాడు" అని చెప్పింది. అయితే మరుసటి రోజు శంకర్ అనే బాలుడిని చంపేస్తున్నారనే విషయం తెలుసుకున్నాడు జైరాజన్. వెంటనే శంకర్ తల్లిదండ్రులను కలిసి కావాలంటే శంకర్ బదులుగా తాను ప్రాణాలను త్యాగం చేస్తానని బాలుడికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పుకొచ్చాడు. అయితే ఇందుకు వారు ఒప్పుకోలేదు.

ఇక ప్రాణత్యాగం చేసే రోజు రానే వచ్చింది. శంకర్‌కు బదులుగా తాను బలవడానికి సిద్ధంగా ఉన్నాడు జైరాజన్. గరుడ అనే ఈ గద్ద జైరాజన్‌ను గట్టిగా ఒడిసి పట్టుకుంది. ఇది చూసిన శంకర్ జైరాజన్‌ను కాపాడే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. జైరాజన్ చనిపోయాడు.ఇది తెలుసుకున్న జైరాజన్ భార్య తన భర్తను ప్రాణాలతో తిరిగి ఇవ్వమని గద్ద వద్ద ప్రాథేయపడింది. భర్తపై తనకున్న భక్తిని గమనించిన గద్ద జైరాజన్‌‌ను ప్రాణాలతో తిరిగి అప్పజెప్పింది. తనలా ఎవరి ప్రాణాలైతే తీసిందో వారందరి ప్రాణాలు తిరిగి ఇవ్వాల్సిందిగా జైరాజన్‌ గరుడను కోరడంతో ఆయన కోరికను నెరవేర్చింది.అందరి ప్రాణాలను తిరిగి ఇచ్చేసింది.

ఇక కథ ముగించిన బేతాళుడు రాజు విక్రమాదిత్యకు ఒక ప్రశ్న సంధించాడు. "ఈ కథలో త్యాగం చేసిన ఇద్దరిలో ఎవరి త్యాగం గొప్పది. జైరాజన్‌దా లేదా శంకర్‌దా"? ఇందుకు విక్రమాదిత్యుడు టక్కున జవాబిచ్చాడు. శంకర్ చేసిన త్యాగమే గొప్పదన్నాడు. ఎందుకంటే బాలుడైన శంకర్ స్వచ్చందంగా ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధమయ్యాడు.ఆ ప్రకారంగా ముందుకొచ్చాడు అని విక్రమ్ చెప్పడంతో రాజు భుజంపై ఉన్న బేతాళుడు వెంటనే తుర్రుమని ఎగిరి మర్రి చెట్టుపైకి నక్కాడు. తిరిగి ఆ బేతాళుడిని పట్టుకునే ప్రయత్నం ప్రారంభించాడు విక్రమాదిత్యుడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+