Papaya Side Effects: బొప్పాయి ఎక్కువగా తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..
మనం ఎక్కువగా ఇష్టపడని పండ్లలో బొప్పాయి ఒకటి. కానీ బొప్పాయి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి ఇంకా ఇతర పోషకాలు ఉంటాయట.ఇందులో విటమిన్లతో పాటు మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, మాంగనీస్ వంటి మినరల్స్ ఉంటాయి. బొప్పాయయిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు సహాయపడతాయి.
బొప్పాయిలో ఉండే ఫోలేట్ కారణంగా రక్త నాళాలు పాడవకుండా ఉంటాయట.
బొప్పాయి తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుందట. బొప్పాయిలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఎనీమియా వంటి వ్యాధుల్లో ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. శ్వాస సంబంధిత సమస్యలు కూడా దూరమౌతాయట. గర్భిణీ స్త్రీలు బొప్పాయిని తినకూడదు. ఈ పండును గర్భిణీ స్త్రీలు తింటే గర్భస్రావం అయ్యే అవకాశాలున్నాయి. దైనా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న వారు బొప్పాయిని తీసుకోవద్దట.

కామెర్ల సమస్యతో బాధపడేవారు బొప్పాయిని అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పాపైన్, బీటా కెరోటిన్ అనే ఎలిమెంట్స్ కామెర్ల సమస్యను మరింత ఎక్కువ చేస్తుందట. అలాగే సాధారణం కంటే రక్తం ఎక్కువ ఉన్నవారు కూడా బొప్పాయిని తినొద్దని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications