వాస్తు ప్రకారం తులసి ఆకులకు చందనం పూసి పూజలు చేయండి- ఫలితం మీరే చూస్తారు
హిందూ ధర్మంలో తులసి మొక్కకు అత్యంత ప్రాధాన్యత ఉంది. తులసిని లక్ష్మీదేవి, విష్ణుప్రియగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం, తులసి లేనిదే శ్రీ మహావిష్ణువు నైవేద్యాన్ని స్వీకరించరు. తులసి ఆకుకు చందనం పూసి పూజలు చేస్తే, ఆ శ్రీహరి త్వరగా ప్రసన్నుడవుతాడు. ఇంట్లో సుఖశాంతులు, సంపద కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.
చందనం శీతలం, పవిత్రతకు చిహ్నం. తులసిపై చందనం పూయడం వల్ల దాని సువాసన అనేక రెట్లు పెరుగుతుంది. ఈ దివ్య సుగంధం ఇంటిని శుద్ధి చేస్తుంది. ప్రతికూల శక్తిని పారద్రోలుతుంది. తులసీ ఆకులపై చందనం రాసి సమర్పించడం భక్తుని సంపూర్ణ సమర్పణకు సూచికగా భావిస్తారు. దీనివల్ల మనస్సు ప్రశాంతం అవుతుంది, భగవంతుని కృపను పొందగలరని జ్యోతిష్కులు చెబుతారు.

చందనం పూసిన తులసిని ఆలయంలో ఉంచడం వల్ల ఇంటి వాస్తు దోషాలు తొలగిపోతాయి. ప్రతికూలతలు దూరమై, సానుకూల శక్తి పెరుగుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. తులసి బుధ గ్రహంతో, చందనం చంద్రుడు, బృహస్పతితో సంబంధం కలిగి ఉన్నాయి. ఈ కలయిక బుద్ధిని పదును పెట్టి, మనస్సును శాంతపరుస్తుంది.
జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే, చందన శీతలం మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. అంతేకాదు- రాహు, కేతువుల వంటి ఛాయా గ్రహాల దుష్ప్రభావాలు కూడా తగ్గి, ఇంట్లో కలహాలు, వ్యాధులు, ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.
వీటన్నింటినీ పొందడానికి ప్రతిరోజూ ఉదయం తులసి ఆకుపై చందనం తిలకం రాసి, శ్రీ మహావిష్ణువుకు లేదా శ్రీకృష్ణుడికి ఆలయంలో సమర్పించాలి. 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మంత్రాన్ని జపించి, సాయంత్రం దీపం వెలిగించాలి. ఫలితం మీరే చూస్తారు.
దీనితో పాటు తులసి కొమ్మను అరగదీసి తయారుచేసిన 'హరి చందనం' దేవుడికి సమర్పిస్తే అపారమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఒక శుభ్రమైన రాయిపై కొద్దిగా గంగాజలం లేదా శుభ్రమైన నీరు పోసి, ఎండిన తులసి కర్రను అరగదీయడం ద్వారా ఈ 'హరి చందనం' లేపనాన్ని తయారుచేయవచ్చు.












Click it and Unblock the Notifications