స్మార్ట్ ఫోన్ అడిక్షన్: ఈ లక్షణాలు ఉంటే ఖచ్చితంగా మీరు సెల్ ఫోన్లకు బానిసలైనట్టే!!
ప్రస్తుత సమాజంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ లు మన జీవితంలో భాగంగా మారిపోయాయి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి, నిద్రపోయే వరకూ చేతిలో మొబైల్ ఫోన్ లేకుండా ఎవరు ఉండడం లేదు. ఏ సమాచారం తెలుసుకోవాలన్నా, ఏం చేయాలన్నా సరే చేతిలో ఫోన్ లేకపోతే మనం పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. అయితే చాలామంది స్మార్ట్ ఫోన్ లకు వారికి తెలియకుండానే బానిసలుగా మారుతున్నారు. ఇక ఆ అడిక్షన్ గురించి తెలుసుకోలేకపోతున్నారు.

స్మార్ట్ ఫోన్ అడిక్షన్ తో ప్రవర్తనా సమస్యలు
తమ చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధం లేకుండా, కనీసం స్నేహితులతో కూడా మాట్లాడకుండా, బయట ఏ కార్యక్రమాలలోనూ పాల్గొనకుండా ఎక్కడ ఉన్నా సరే వారు వారి చేతిలో ఉన్న ఫోన్ లతోనే గడిపేస్తున్నారు. ఇది వారికే తెలియని అడిక్షన్ అంటున్నారు. ఇది చాలా ప్రమాదం అని చెబుతున్నారు వైద్యనిపుణులు. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నవారు సెల్ ఫోన్ లకు బానిసలుగా మారుతున్నారు. 20 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు సెల్ ఫోన్ లకు ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారని, తద్వారా వారు ప్రవర్తన సమస్యలను ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు.

సెల్ ఫోన్ కనిపించకుంటే ఆందోళన .. డిప్రెషన్
ఎప్పుడు సెల్ ఫోన్ లో మునిగి ఉంటూ ఆన్లైన్ గేములు, సోషల్ మీడియా సైట్ లు, కంటిన్యూగా చాటింగ్ తదితర చర్యలతో వీరు సెల్ ఫోన్ లేకుంటే బ్రతకలేని పరిస్థితికి చేరుకున్నారు. అర్దరాత్రి వరకు సెల్ ఫోన్ లలోనే గడుపుతున్నారు. ఉదయం నిద్రలేవగానే స్మార్ట్ ఫోన్ నే పట్టుకుంటున్నారు. ఇక సెల్ ఫోన్ అడిక్షన్ కు గురైన వారు కాసేపు సెల్ ఫోన్ కనిపించకపోతే ఆందోళనకు గురవుతారు. కాసేపు సెల్ ఫోన్ సిగ్నల్ రాకున్నా, ఫోన్ అందుబాటులో లేకున్నా డిప్రెషన్ కు లోనవుతారు. తాము ఏదో కోల్పోయినట్టు ఆత్మన్యూనతా భావానికి లోనవుతారు.

కుటుంబసభ్యులకు, స్నేహితులకు, సమాజానికి దూరంగా.. స్మార్ట్ ఫోన్ వ్యసనం
వారిలో స్వీయనియంత్రణ నశిస్తుంది. క్రమశిక్షణ లేకుండా పోతుంది. రోజు వారి పనులకు మీ మొబైల్ ఫోన్ వాడకం ఇబ్బందులు కలిగిస్తున్నా పట్టించుకోరు. ఇక సెలవు దినాల్లో కూడా కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉండకుండా స్మార్ట్ ఫోన్ లోనే మునిగిపోయి ఉంటారు. స్నేహితులతో కలిసి సరదాగా గడిపే క్షణాలను కూడా స్మార్ట్ ఫోన్ తోనే గడుపుతారు. స్మార్ట్ ఫోన్ వ్యసనం వల్ల మెడ నొప్పి, కంటి ఒత్తిడి వంటి అనారోగ్య సమస్యలు కలిగి హానికరమైన ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తున్నా అవేవీ పట్టించుకోరు.

స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అయితే అనేక మానసిక, శారీరక రుగ్మతలు
సెల్ ఫోన్ పరధ్యానంతో సమయస్ఫూర్తిని కోల్పోతారు. విపరీతమైన స్మార్ట్ ఫోన్ అడిక్షన్ మిమ్మల్ని మీ ఉద్యోగాన్ని కూడా సరిగ్గా చేసుకోనివ్వదు.స్మార్ట్ ఫోన్ విపరీతమైన అడిక్షన్ మీకు నిద్ర లేకుండా చేస్తుంది. స్మార్ట్ ఫోన్ లేకుంటే చచ్చిపోతాం అన్నంత ఇబ్బంది కలుగుతుంది. స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని తగ్గించడం కోసం ఎంత ప్రయత్నం చేసినా ఆ పని చేయలేనంత బలహీనమైన స్థితికి మీరు చేరుకుంటారు. మీరు ఈ లక్షణాలలో దేనినైనా కలిగి ఉన్నట్లయితే, మీరు స్మార్ట్‌ఫోన్ వ్యసనానికి బానిస అయ్యారని అర్థం చేసుకోండి.












Click it and Unblock the Notifications