ఇంట్లో పూజా గదిలో ఈ తప్పులు చేయవద్దు.. !!
ఇంట్లో ఎటువంటి దోషాలు ఉండకుండా తొలగిపోవాలంటే ప్రతిరోజు దీపారాధన చేయడం ముఖ్యం. ఉదయం, సాయంత్రం వేళల్లో దీపారాధన చేస్తే అనేక దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు. ఘంటా నాదం వినిపించడం వల్ల సానుకూల వాతావరణం నెలకొంటుంది. నిత్యం పూజలు నిర్వహించే ఇళ్లల్లో నెగెటివ్ ఎనర్జీ దూరమౌతుంది. ఏకాగ్రతతో పూజ చేసే భక్తులకు శాంతి లభించి, ప్రతికూల ఆలోచనలు మనసు నుంచి తొలగిపోతాయి.
పూజలు త్వరగా ఫలించాలంటే కొన్ని నియమాలను పాటించడం తప్పనిసరి. ప్రతి ఇంట్లో కుల దేవత, గ్రామ దేవతలను నిత్యం పూజించడం అవసరం. ఏ దేవుడిని పూజించినా, వారిని ఆహ్వానించడం, ధ్యానం చేయడం, ఆసనం ఇవ్వడం, ధూపం-దీపాలను భక్తి శ్రద్ధలతో వెలిగించడం, బియ్యం, కుంకుమ, చందనం, పుష్పాలు, ప్రసాదం సమర్పించడం వంటివి తప్పనిసరి.

వీటి విషయంలో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించక తప్పదు. పూజకు ఉపయోగించే బియ్యం పగిలినవి కాకుండా చూసుకోవాలి. వాటిని దేవుడికి సమర్పించే ముందు పసుపును కలపాలి. పసుపును నీటిలో కలిపి, ఆ నీటిలో బియ్యాన్ని ముంచి పసుపు రంగులోకి తీసుకురావాలి. పూజ సమయంలో తమలపాకును కూడా సమర్పించాలి. తమలపాకులు మాత్రమే కాకుండా, వాటితో పాటు యాలకులు, లవంగాలు, తీపి పదార్థాలు ఉంచి సమర్పించడం శ్రేయస్కరం.
దేవి దేవతల ముందు నెయ్యి, నూనె దీపాలు రెండింటినీ వెలిగించాలి. ఇంట్లో రోజూ నెయ్యి దీపం వెలిగిస్తే, గృహంలో ఉండే అనేక దోషాలు తొలగిపోతాయి. పూజ సమయంలో మనం కూర్చున్న ఆసనాన్ని కాళ్ళతో కదపకూడదు. ఆసనాన్ని చేతులతో మాత్రమే కదపడం సరైన పద్ధతి. దేవీదేవతలకు పూలదండలు, పువ్వులు, ఆకులు సమర్పించే ముందు వాటిని శుభ్రమైన నీటితో తప్పకుండా కడగాలి.
ఇంట్లో లేదా ఆలయంలో ఏదైనా ప్రత్యేక పూజ చేసేటప్పుడు, ఇష్టదైవంతో పాటు స్వస్తిక్, కలశం, నవగ్రహ దేవతలు, షోడశ మాతృకలు, సప్త మాతృకలను తప్పనిసరిగా పూజించాలి. శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం అంటూ వినాయకుడిని జపిస్తూ పూజ ఆరంభించడం ఎంతో మంచిది. దీనివల్ల పూజలో ఎటువంటి విఘ్నాలు కలగబోవని, పూజా ఫలం అందుతుందని పెద్దలు చెబుతారు.












Click it and Unblock the Notifications