పండగ వేళ.. గుమ్మానికి ఇవి కట్టి చూడండి..!!
ఇంట్లో శాంతి, సంతోషాల కోసం కొన్ని వాస్తు నియమాలు పాటించడం తప్పనిసరి. ఈశాన్యంలో దేవుడి గదిని నిర్మించడం, ఆగ్నేయంలో వంటగది.. వంటివి ఇందులో కొన్ని. అలాగే- ఇంటి ముఖ ద్వారం కూడా వాస్తశాస్త్రంలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఇల్లు మొత్తానికీ రాకపోకలు సాగించడానికి, అడుగు బయటపెట్టేటప్పుడు అన్నీ సానుకూల ఫలితాలు రావాలనుకుంటే ముఖద్వారం ముఖ్య ప్రదేశం. సానుకూల- ప్రతికూల శక్తులు ప్రవేశించడానికి కూడా ఇదే కీలకం.
వాస్తు నియమాలకు అనుగుణంగా మన ప్రధాన ద్వారం వద్ద కొన్ని వస్తువులు ఉంచితే, ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించి, జీవితంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి. ప్రధాన ద్వారం వద్ద ఏవి ఉంచాలో ఇప్పుడు చూద్దాం.

స్వస్తిక్ చిహ్నం: వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తును ఉంచవచ్చు. ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకొని, సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. ఈ చిహ్నం సంతోషం, శ్రేయస్సులకు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
నిమ్మకాయ-మిరపకాయ తోరణం: ప్రధాన ద్వారం వద్ద నిమ్మకాయ-మిరపకాయల తోరణాన్ని వేలాడదీయవచ్చు. ఈ తోరణం ఇంట్లోని వాస్తు దోషాలను తొలగిస్తుంది. దీనిని తలుపు మధ్యలో ఉంచవచ్చు. ప్రతి మంగళవారం, శనివారం ఈ తోరణాన్ని మార్చడం మంచిది.
సూర్య యంత్రం: వాస్తు ప్రకారం, మీ ఇంటి ప్రధాన ద్వారంపై సూర్య యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దీనిని ద్వారంపై ఉంచడం వల్ల మీ గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. అలాగే- కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది. సూర్య యంత్రాన్ని ఉంచడం గ్రహ దోషాలను కూడా దూరం చేస్తుంది.
శంఖం: మీరు ఇంటి ప్రధాన ద్వారం వద్ద శంఖాన్ని ఉంచవచ్చు. ఇది ఇంటిలో ఆనందం, శాంతిని కాపాడుతుంది. అంతేకాకుండా, ఇది శ్రేయస్సును తెచ్చి, కుటుంబ ఆదాయాన్ని పెంచుతుంది. శంఖాన్ని ప్రతిరోజూ గంగాజలంతో శుభ్రం చేసి, ఎర్రటి వస్త్రంలో కట్టి వేలాడదీయవచ్చు. దీనిని ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఇంట్లో ఉంటుంది.












Click it and Unblock the Notifications