India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీరామ నవమి విశిష్టత ఏంటీ..? ఎలా పూజా చేయాలి, శుభ ముహూర్తం, ఏ మంత్రాలు పఠించాలి..

|
Google Oneindia TeluguNews

శ్రీరామ నవమి.. ఈ రోజు కలియుగ దైవం శ్రీరామచంద్రడు జన్మించారు. అలాగే ఆయనకు సీతాదేవితో కల్యాణం కూడా జరిగింది. హిందు బంధవులు నవమి వేడుకను కన్నుల పండుగగా జరుపుకుంటారు. ఈ సారి 10వ తేదీ ఆదివారం రోజున నవమి వచ్చింది. చైత్రశుద్ధ నవమి అంటే చైత్ర మాసంలో తొమ్మిదవ రోజు అని అర్ధం. వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్మం 12 గంటలకు త్రేతాయుగంలో జన్మించారు.

పుణ్య స్నానాలు చేసి..

పుణ్య స్నానాలు చేసి..

రాముని జన్మస్థలం అయోధ్య.. అక్కడ సరయు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, వేడుకల్లో పాల్గొంటే మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. చాలా మంది భక్తులు హాజరు అవుతారు. ఈ రోజున చాలా మంది భక్తులు ఉపవాసం కూడా ఉంటారు. రాముని శిశువు రూపాన్ని పూజిస్తారు. ప్రజలు రామాయణాన్ని ఇతరులకు వివరిస్తారు. రామ రక్షా స్తోత్రాన్ని పఠిస్తారు.

నవమి ప్రారంభం..

నవమి ప్రారంభం..

9వ తేదీ శనివారం 3.53 గంటల నుంచి నవమి ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం 5.45 గంటల వరకు నవమి ఉంటుంది. తర్వాత దశమి ప్రారంభం అవుతుంది. ఆదివారం ఉదయం 10.45 గంటల నుంచి మధ్యాహ్నాం 1.14 గంటల వరకు నవమి ఉంటుంది. అంటే సరిగ్గా 12 గంటలకు రాములొరి కల్యాణం జరగనుంది. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4.16 గంటల నుంచి ఉదయం 5.02 గంటల వరకు ఉంటుంది. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2.03 గంటల నుంచి మధ్యాహ్నం 2.53 గంటల వరకు ఉంటుంది. గోధులి ముహూర్తం సాయంత్రం 5.58 గంటల నుంచి సాయంత్రం 6.22 గంటల వరకు ఉంది.

స్త్రోత్రాలు

స్త్రోత్రాలు


ఓం శ్రీ రామయ: నమ:
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
ఓం దశరథయే విద్మహే సీతావల్లభయ ధిమాహీ తనో రామ ప్రచోదాయత్
అనే స్త్రోత్రాలు చదివి రాముని కృపకు పాత్రులు కాగలరని పురాణాలు చెబుతున్నాయి.

ఇదీ నేపథ్యం..

ఇదీ నేపథ్యం..


ఇక నేపథ్యం విషయానికి వస్తే.. అయోధ్యకు రాజు దశరథుడు.. అతనికి ముగ్గురు భార్యలు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. బాధ అంతా సంతానం గురించే. సంతానం లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని బాధపడేవారు. వశిష్ట మహాముని దశరథ రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్నినిర్వహించే బాధ్యతను అప్పజెప్పాలని కోరాడు. దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్లి తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్రకు ఇచ్చారు. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి రోజున.. మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మను ఇచ్చింది. కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు. రాముడి సత్య వాక్కు పరిపాలకుడు.

English summary
Ram Navami will be observed on Sunday, April 10, this year. According to the Hindu calendar, Ram Navami is celebrated on the Navami Tithi in Shukla Paksha of the Chaitra month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X