వైవిధ్యానికి పట్టాభిషేకం: భారతీయ కథకులకు IGF ఆర్చర్ అమిష్ అవార్డు..!!

భారత్‌ ఆధునిక సాహిత్య వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించేందుకు ఇండియా గ్లోబల్ ఫోరం (IGF) ప్రారంభించిన అర్చర్ అమీష్ అవార్డు ఫర్ స్టోరీటెల్లర్స్ తొలి విజేతను ఈ వారం ప్రకటించనుంది. అంతర్జాతీయ రచయితలుగా గుర్తింపు పొందిన జెఫ్రీ ఆర్చర్, అమిష్ త్రిపాఠీల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరగనుంది. అభినందన్ లోధా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తోంది.ఆధునిక భారత విభిన్నతను, ఆశయాలను, శక్తిని ప్రతిబింబించే కథనాలను ఎంపిక చేసి ఆ సాహిత్య అవార్డుతో గౌరవించనున్నారు.ఈ అవార్డుల ద్వారా భారతదేశ శక్తిని ప్రపంచ దేశాలకు చాటడమే కాకుండా, భారత్‌ ఆయా దేశాల మధ్య సాంస్కృతిక బంధం బలోపేతం అవుతుంది.

అంతర్జాతీయ సాహిత్య రంగంలో భారత రచయితల కీర్తిని మరింతగా పెంచే ఈ పురస్కారం, ప్రపంచంలోని అత్యంత ఉన్నత ఫిక్షన్ అవార్డుల్లో ఒకటిగా $25,000 (దాదాపు రూ. 21 లక్షలు) నగదు బహుమతిని కలిగి ఉంది.

Global Gateway for Indian Voices IGF Archer Amish Award Honours Diverse Narratives

యూకే ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లిసా నాండీ ఎంపీ,IGF ఛైర్మన్ మనోజ్ లద్వాతో పాటు రచయితలు ఆర్చర్,అమిష్‌తో కలిసి ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. లిసా నాండీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా యూకే సాంస్కృతిక విధానం ఎలా రూపాంతరం చెందిందనేది తెలుస్తోంది. ముఖ్యంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తర్వాత యూకేతో భారత్‌కు ఉన్న భాగస్వామ్యాన్ని నొక్కి చెబుతోంది.

ఫైనలిస్టులు వీరే..
నవపాషణం రచయిత నిత్య నీలకంఠన్,ది కిల్ స్విచ్ పుస్తక రచయిత యోగేష్ పాండే,ది వే హోమ్ రచయిత్రి డాక్టర్. షాలినీ ములిక్క్‌లు ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం పోటీపడుతున్నారు. "భారతదేశపు గొంతుకను ప్రపంచ అవనికపై వినిపించడంలో IGF ఆర్చర్ అమిష్ అవార్డుల పాత్ర ఎంతో ఉంటుంది.భారత్‌కు చెందిన రచయితలు తాము తమదైన శైలిలో రాసే కథనాలు విశ్వవ్యాప్తంగా ఆరోగ్యవంతమైన చర్చకు తావిస్తున్నాయి.తద్వారా ఆయా దేశాలతో బంధాలు మరింత బలోపేతం అవుతున్నాయి.ముఖ్యంగా భారత్ -యూకే దేశాల బంధం దృఢంగా మారింది.ఇందుకోసమే ఈ అవార్డులను ప్రవేశపెట్టాం" అని ఐజీఎఫ్ వ్యవస్థాపకులు, ఛైర్మెన్ మనోజ్ లాద్వా చెప్పారు.

"ఇలాంటి అవార్డులు చాలా ప్రాముఖ్యమైనవి.ఈ అవార్డులు గుర్తింపునిస్తాయి,పగలనక రాత్రనక కష్టపడి మంచి పుస్తకాలు రాయడమంటే మామూలు విషయం కాదు.కచ్చితంగా వారికి మంచి గుర్తింపు దక్కుతుంది"అని బ్రిటీష్ రచయిత లార్డ్ ఆర్చర్ అభిప్రాయపడ్డారు.ఆయన రాసిన కేన్ అండ్ ఏబెల్, ది క్లిఫ్టన్ క్రానికల్స్ నవలలు ప్రపంచ వ్యాప్తంగా అధిక సంఖ్యలో అమ్ముడుపోయాయి.
ఈ అవార్డును మొదలుపెట్టడంలో కీలక పాత్ర పోషించి, జడ్జింగ్ ప్యానెల్‌కు నాయకత్వం వహించిన అమిష్ త్రిపాఠి ఈ సందర్భంగా మాట్లాడారు. "ఈ అవార్డు కథ చెప్పే కళను ప్రోత్సహిస్తుంది. పశ్చిమ దేశాల వారు ఇండియాను చూసే విధానం వేరు, భారతీయులు ఇండియాను చూసే విధానం వేరు. మన కథలను మన కోణంలోనే ప్రపంచానికి చెప్పాలి." అని అన్నారు.

జూన్ 18వ తేదీన ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవం ప్రముఖ క్వీన్ ఎలిజబత్ II సెంటర్ వేదికగా జరగనుంది.ఐజీఎఫ్ లండన్ 2025లో భాగంగా ఈ అవార్డుల ప్రదానోత్సవం భారత్ యూకే దేశాల మధ్య సాంస్కృతిక చర్చలకు ద్వారం తెరిచినట్లుగా అవుతుంది.

ఇండియా గ్లోబల్ ఫోరం గురించి:
ఆధునిక భారతం గురించి ఇండియా గ్లోబల్ ఫోరం వివరిస్తుంది.అత్యంత వేగంగా రూపాంతరం చెంది, అభివృద్ధి వైపు దూసుకెళుతోంది భారత్.దీంతో ప్రపంచ దేశాల దృష్టి భారత్‌పై పడింది.భారత్‌లో అవకాశాల కోసం ప్రపంచ దేశాలు చూస్తున్నాయి.ఈ క్రమంలోనే ఐజీఎఫ్‌ భారత్‌ ప్రపంచ దేశాల మధ్య వారధిగా నిలుస్తోంది.ఐజీఎఫ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+