మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కార్యాలయంలో భారీ చోరీ

మంగళగిరి ఎమ్మెల్యే సిఆర్డిఏ చైర్మన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయం లో భారీ చోరీ జరిగింది. నియోజకవర్గంలోని సంక్షేమ కార్యక్రమాల కోసం దాచి ఉంచిన 10 లక్షల రూపాయలు చోరీకి గురైంది. దీంతో వైసిపి నేత జూపూడి జాన్సన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

మంగళగిరి అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఈ చోరీ పై కేసు నమోదైంది. కార్యాలయంలో పనిచేసే వారు చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఎమ్మెల్యే కార్యాలయంలోకి బయట వ్యక్తులు వచ్చి చోరీకి పాల్పడే అవకాశం లేదని భావిస్తున్న పోలీసులు ఇంటి దొంగను పట్టుకునే పనిలో ఉన్నారు .ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఆఫీసులో చోరీ జరగటం షాక్ కు గురి చేస్తున్న విషయం .

A major theft in Mangalagiri MLA Alla Ramakrishna Reddys office

ఒక పక్క నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేస్తున్నారు. ప్లాస్టిక్ రహిత మంగళగిరి గా మంగళగిరి ని మార్చడం కోసం ఆయన పలు కార్యక్రమాలు చేపట్టారు ఇటీవల మంగళగిరి మిద్దె సెంటర్ లో ఉన్న మార్కెట్ వద్దకు వచ్చిన కొనుగోలుదారుల అందరికీ జూట్ బ్యాగ్ లను పంపిణీ చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇక రాజధాని ఏర్పాటు విషయంలో కూడా ఆళ్ళ తనదైన శైలిలో స్పందించారు .మంగళగిరి రాజధానికి అనుకూలమని నిపుణుల కమిటీకి చెప్తామని పేర్కొన్నారు ఆళ్ళ .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+