అమరావతి నిరసనల్లో వైసిపి కార్యకర్తలు: సచివాలయానికి నల్లరంగు: వెలగపూడిలో ఉద్రిక్తత..!
అమరావతి నిరసనలు కొత్త టర్న్ తీసుకున్నాయి. ఇప్పటి వరకు టీడీపీ నేతల అండగా సాగుతున్న ఆందోళనగా కొందరు మంత్రులు చేసిన విమర్శల పైన రైతులు మండిపడుతున్నారు. ఇదే సమయంలో తాజాగా జీఎన్ రావు కమిటీ ఇచ్చిన సిఫార్సులకు వ్యతిరేకంగా అమరావతి లో సాగుతున్న ఆందోళనల్లో వైసీపీ కార్యకర్తలుగా చెప్పుకుంటున్న కొందరు స్థానిక కార్యకర్తలు పాల్గొంటున్నారు. తాము జగన్ గతంలో రాజధానికి అనుకూలంగా మాట్లాడిన మాటలను నమ్మి..
మద్దతుగా నిలిచామని వాపోతున్నారు. ఇదే సమయంలో వెలగపూడిలోని గ్రామ సచివాలయానికి ఇప్పటి వరకు ఉన్న వైసీపీ రంగులను తుడిచి వేసి.. నల్లరంగు వేసి నిరసన వ్యక్తం చేయటానికి ప్రయత్నం చేసారు. వారికి గ్రామస్థులు సైతం సహకరించారు. ఆ సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసారు. దీంతో..గ్రామస్థులు ఎదురు తిరిగారు. పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఆందోళనకు దిగారు.

వెలగపూడిలో ఉద్రిక్తత..
పంచాయితీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున గ్రామస్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారంతా అక్కడి గ్రామ సచివాలయానికి నల్ల రంగు వేయటం కోసం పోటీ పడుతున్నారు . వారిని అడ్డుకొనేందుకు పోలీసులు అడ్డుకుంటున్నారు. వీరిదో పోలీసులు వాగ్వాదానికి దిగారు. కార్యాలయానికి నల్లరంగు వేసే వారికి అక్కడి నుండి పంపించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో..స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. తమ బాధ పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం..
తమ గ్రామంలో భవనాలకు రంగులు ఉండటానికి వీళ్లేదని వాదిస్తున్నారు. దీని పైన తాజాగా హైకోర్టులో జరిగిన వాదనల గురించి కొందరు రైతులు పోలీసులను ప్రస్తావిస్తున్నారు. స్థానిక మహిళలు మాత్రం ప్రభుత్వం పైన..జీఎన్ రావు కమిటీ పైన పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఏమయ్యారని నిలదీస్తున్నారు. జీఎన్ రావు కమిటీ తమ గ్రామాల్లోని రైతుల తో ఎటువంటి సంప్రదింపులు జరపలేదని.. అబద్దాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకూ ఆందోళన కొనసాగుతుందని స్థానికులు నినదిస్తున్నారు.












Click it and Unblock the Notifications