• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటూరులో నవ వధువుకి షాక్‌ - నైటీలో భర్త వికృత చేష్టలు- ఫస్ట్‌ నైట్‌కే భయపడేలా

|
Google Oneindia TeluguNews

కాలం మారుతున్నా, ప్రభుత్వాలు ఎన్ని కొత్త చట్టాలు తీసుకొస్తున్నా జనం ప్రవర్తనలో మార్పు రావడం లేదని చెప్పేందుకు తార్కాణంగా గుంటూరు జిల్లాలో ఓ ఘటన చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న సాఫ్ట్‌వేర్ దంపతులు హాయిగా కాపురం చేసుకుంటారని భావించిన తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు వారు ఊహించని షాక్‌ తగిలింది. దీనికి కారణం సదరు భర్త విపరీత ప్రవర్తనే. ఫస్ట్‌ నైట్‌ రోజు భార్యను అప్యాయంగా దగ్గర తీసుకోవాల్సిన భర్త అనూహ్యంగా విపరీత చేష్టలకు దిగడంతో ఆ భార్యకు ఏం చేయాలో తెలియలేదు. సరే తొలిసారి భయంతో అలా చేశాడని భావించి మరోసారి సిద్ధమైనా... ఈసారి మరింత దారుణ అనుభవం ఎదురైంది.

 సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల పెళ్లి...

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల పెళ్లి...

ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అయిన యువతికి, ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన యువకుడికి తాజాగా పెళ్లి జరిగింది. అక్టోబర్‌లో వీరిద్దరికీ పెద్దలు పెళ్లి చేశారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే కావడం, రెండూ ఉన్నత కుటుంబాలు కావడంతో కాపురం సజావుగా సాగిపోతుందని అంతా భావించారు. పెళ్లయిన కొన్నిరోజల తర్వాత ఫస్ట్‌ నైట్‌ ఏర్పాటు చేశారు. ఎన్నో ఆశలతో కొత్త కాపురం ప్రారంభిస్తున్న వీరిద్దరూ ఫస్ట్‌నైట్‌ ఎంతో సంతోషంగా జరుపుకుంటారని అనుకున్నారు. కానీ అక్కడే సీన్‌ రివర్స్‌ అయింది.

ఫస్ట్‌నైట్‌లో తేలిపోయిన భర్త...

ఫస్ట్‌నైట్‌లో తేలిపోయిన భర్త...

ఫస్ట్‌ నైట్‌కు అన్ని ఏర్పాట్లు చేసి ఇద్దరినీ లోపలికి పంపారు. కానీ భర్త మాత్రం భార్య ఊహించిన విధంగా సహకరించలేదు. దీంతో భార్యకు అనుమానం మొదలైంది. తొలి రాత్రి అతని ప్రవర్తనతో భార్య భయపడింది. ఏం జరిగిందో ఇంట్లో వాళ్లకు కూడా చెప్పుకోలేని పరిస్ధితి. దీంతో ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత తొలిరాత్రి సవ్యంగా జరగలేదని ఇంట్లో వాళ్లకు కూడా అర్ధమైంది. దీంతో కొన్ని రోజులు విరామం ఇవ్వాలని నిర్ణయించారు. తాజాగా రెండు రోజుల క్రితం వీరికి మరోసారి ఫస్ట్‌ నైట్‌ ఏర్పాటు చేశారు. దీంతో ఇక మొత్తం అందరికీ క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు భార్య అనుకున్నంతా అయింది.

నైటీలో భర్త వికృత చేష్టలతో...

నైటీలో భర్త వికృత చేష్టలతో...

తొలిరాత్రి ఏం జరిగిందా అని ఆరా తీస్తే చెప్పుకోలేని దారుణాలే జరిగాయని అర్ధమైపోయింది. ఫస్ట్‌నైట్‌లో ఆమె నైటీ వేసుకున్న భర్త వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దీంతో భార్య భయపడిపోయింది. చివరికి ఎదిరించింది. దీంతో ఆమెకు బలవంతంగా మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చాడు. ఆమె మత్తులోకి వెళ్లగానే మర్మాయవాలు, శరీరంపై గాయాలు చేశాడు. దీంతో తేరుకున్న తర్వాత గాయాలతో ఆమె ఏడుస్తూ వెళ్లి తల్లితండ్రులకు చెప్పుకుంది. వారు ఆమె అత్తమామలకు నిలదీశారు. కానీ వారు ఎదురుదాడికి దిగారు. మీ అమ్మాయే సంసారానికి పనికి రాదంటూ గొడవ పెట్టుకున్నారు.

సంసారానికి పనికిరాడంటూ పోలీసులకు ఫిర్యాదు

సంసారానికి పనికిరాడంటూ పోలీసులకు ఫిర్యాదు

ఫస్ట్‌ నైట్‌ పేరుతో జరిగిన వికృత చేష్టలు, తనను గాయపరచడంపై భార్య గుంటూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంసారానికి పనికి రాని తన భర్త దాన్ని కప్పిపుచ్చుకునేందుకు తనను గాయపరిచాడని వివరించింది. తాను సంసారానికి పనికి రానని చూపేందుకు ప్రయత్నించాడని పోలీసులకు చెప్పుకుంది. తల్లితండ్రులతో కలిసి గాయాలతోనే పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శాడిస్ట్‌ భర్త ప్రవర్తన తెలుసుకున్న పోలీసులు కూడా ఆశ్చర్య పోతున్నారు.త్వరలో దర్యాప్తు పూర్తి చేసి నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని పోలీసులు చెప్తున్నారు.

English summary
guntur rural police have received a complaint from a newly married women on her husband's sadist behaviour on first night. police identified that both wife and husband are techies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X