మంగళగిరిలో గెలుపు కోసం లోకేష్ రూ.150 నుండి రూ. 200 కోట్లు పంచారన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి సంచలనం
Recommended Video
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ పై సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరిలో గెలుపు కోసం టీడీపీ అడ్డదారులు తొక్కిందని మండిపడ్డారు.అయినా విజయం వైసీపీదేనని చెప్పారు.

మంగళగిరిలో గెలుపుకోసం 150 కోట్ల నుంచి రూ.200 కోట్లను పంచిన లోకేష్ అన్న ఆళ్ళ రామకృష్ణా రెడ్డి
మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపుకోసం ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ ఏకంగా రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకూ ఖర్చు పెట్టారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .మంగళగిరి నియోజక వర్గ ప్రజలే ఈ విషయం చెప్తున్నారని ఇది తానూ చెప్తున్న మాట కాదని ఆయన పేర్కొన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో గ్రామాల్లో డబ్బులు ఇబ్బడిముబ్బడిగా పంచారని మంగళగిరిలో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు , టూవీలర్లు, టీవీలు, ఐఫోన్లు, ఇష్టంవచ్చినట్లు పంచారని విమర్శించారు. కేవలం గెలుపు కోసం ఇంతగా దిగజారి అవినీతికి పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. అయినా మంగళగిరి ప్రజలు లోకేష్ ను ఆదరించరని ఆళ్ళ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. లోకేష్ ఖర్చు పెట్టిన 200 కోట్లు వృధా అని ఆయన తేల్చి చెప్పారు.

వీడియో విడుదల చేసిన ఆళ్ళ .. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా గెలుపు వైసీపీదే అని ధీమా
ఇక ఈ విషయంపై ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక వీడియో విడుదల చేశారు. మంగళగిరిలో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఆళ్ళ రామకృష్ణా రెడ్డి తనకు ప్రజలు స్వచ్చందంగా ఓట్లు వేశారని ,ఓ నిరుపేద పెద్దావిడ వచ్చి తనకు రూ.వెయ్యి రూపాయలు ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇక ఏపీలో అధికారం కోసం టీడీపీ ఇలాంటి ఎన్ని కుట్రలు చేసినా జగన్ ను ముఖ్యమంత్రి చేసుకోవాలన్న సామాన్యుల, నిరుపేదల ఆకాంక్షల ముందు చంద్రబాబు కుట్రలు నిలబడవని ఆళ్ళ స్పష్టం చేశారు. ఏపీలో వైసీపీ విజయ బావుటా ఎగురవేస్తుందని ఆయన జోస్యం చెప్పారు. వైసీపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు.

మంగళగిరిలో విజయం వైసీపీదే అన్న ఆళ్ళ రామకృష్ణా రెడ్డి
మంగళగిరి ఫలితాలపై పలువురు ఎన్నారైలు కూడా తనను వాకబు చేశారని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళగిరి మాత్రమే కాదు గుంటూరు లోక్ సభ స్థానం కూడా వైసీపీ ఖాతాలోనే పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరి ప్రజలు తనను ఆదరించారని విశ్వాసం వ్యక్తం చేశారు. తాను ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటం, ఇతర కారణాలతోనే ఈ విషయాన్ని ముందుకు తీసుకురాలేకపోయానని చెప్పారు.ఇందుకు క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications