కోవిడ్ టీకా తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకు అస్వస్థత - కీలక వ్యాఖ్యలు

గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అస్వస్థతకు గురయ్యారు. మంగళగిరి ప్రభుత్వాసుపత్రిలో సోమవారం ఆయన కొవిడ్ టీకా తీసుకోగా, రాత్రి నుంచి ఆయనకు 102 డిగ్రీల జ్వరం వచ్చింది. ప్రస్తుతం తన నివాసంలోనే చికిత్స పొందుతోన్న ఆయన.. మంగళవారం సాయంత్రానికి కోలుకునే అవకాశం ఉందని చెప్పారు.

కొవిడ్ టీకా తీసుకున్న తర్వాత జ్వరం లాంటి స్వల్ప లక్షణాలు తలెత్తే అవకాశం ఉందని డాక్టర్లు ముందుగానే హెచ్చరిస్తున్నారు. కాగా, తాను తిరిగి కోలుకుంటానని, జ్వరం తగ్గగానే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండనున్నట్లు ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. మంగళగిరిలో రోజూ 10కిపైగా కొత్త కొవిడ్ కేసులు వస్తుండటం బాధాకరమని, ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని అన్నారు. స్వీయ రక్షణ పాటిస్తూ కరోనాకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. కాగా,

mangalagiri ysrcp mla rk suffers from mild fever after taking covid-19 vaccine

అమరావతి అతర్బాగంగా ఉన్న గుంటూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయానికి ప్రజలంతా మద్దతు తెలిపారనడానికి నిన్న వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఆర్కే అన్నారు.

mangalagiri ysrcp mla rk suffers from mild fever after taking covid-19 vaccine

2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ ఫలితాలే పునరావృతం అవుతాయని ఆర్కే జోస్యం చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసైనా ప్రతిపక్ష నేత చంద్రబాబు తన మనసు మార్చుకోవాలని హితవు పలికారు. అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులంతా చంద్రబాబు చేసిన మోసం ఇప్పటికైనా గుర్తించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+