వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ బుగ్గ గిల్లిన స్కూల్ విద్యార్ధి .. ఏం చేశాడంటే .. వైరల్ వీడియో
Recommended Video
ఏపీ అధికారపక్ష ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి దూకుడు చూపిస్తున్నారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ హుషారుగా పని చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతలు నిత్యం తమ నియోజక వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ,అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం తీసుకుంటున్నారు. ఇక అలాంటి వారిలో గుంటూరు జిల్లా చిలుకలూరిపేట ఎమ్మెల్యే , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విడదల రజనీ చాలా యాక్టివ్ గా ఉన్నారు. నిత్యం ఆమె ప్రజల మధ్యనే ఉండే ఎమ్మెల్యేగా విడుదల రజిని కి మంచి పేరుంది.
నియోజకవర్గంలో సభలు , సమావేశాల్లో ఉత్సాహంగా పాల్గొనే విడదల రజిని ఓ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అక్కడ ఊహించని సంఘటన జరిగింది. ఒక స్కూల్ పిల్లాడు ఊహించని రీతిలో చటుక్కున ఆమె బుగ్గ గిల్లాడు. అంతేనా ఆమె బుగ్గ గిల్లిన బుడతడు ఆమెకు ముద్దు పెట్టాడు. నియోజకవర్గ ప్రజల్ని కలుసుకుంటూ వస్తున్న ఎమ్మెల్యే రజనీకి ఒక స్కూల్ పిల్లాడు చటుక్కున బుగ్గ గిల్లి ముద్దు పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ పిల్లాడు చేసిన చర్యతో సరదాగా నవ్వుకున్న విడదల రజిని అలాగే తన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన వాళ్లంతా విడదల రజినిపై బుడతడు చూపించిన అభిమానంపై కామెంట్స్ చేస్తున్నారు. ఆ స్కూల్ విద్యార్ధి చేసిన పని చూసినవారంతా ఓరి గడుగ్గాయి అంటూ సరదాగా నవ్వుకుంటున్నారు.
YSRCP MLA Vidadala Rajini from Chilkaluripet in Andhra Pradesh taken by surprise and laughs as a boy shows some affection on her. pic.twitter.com/xfUOGu45wl
— Sushil Rao (@sushilrTOI) November 25, 2019












Click it and Unblock the Notifications