కోడెల శివరాం చంద్రన్న ఆశయ సాధన యాత్ర అడ్డుకున్న పోలీసులు-హౌస్ అరెస్ట్

అసెంబ్లీ మాజీ స్పీకర్, దివంగత టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం తాజాగా పార్టీ అధినేతను అధికారంలోకి తెచ్చేందుకు చంద్రన్న ఆశయ సాధన యాత్ర పేరుతో ఓ యాత్ర చేపట్టారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఆయన చేపట్టిన యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో సత్తెనపల్లెలో ఉద్రిక్త పరిస్దితులు చోటు చేసుకుంటున్నాయి.

చంద్రన్న అశయ సాధన యాత్ర మొదలు పెట్టిన శివరాంను స్ధానిక పోలీసులు పాదయాత్ర కు వెళ్లకుండా ముందస్తు అరెస్ట్ చేశారు. కోడెల పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. రాజుపాలెం నుండి దేవరంపాడు వేంటేశ్వస్వామి గుడి వద్దకు కోడెల పాదయాత్ర నిర్వహించాలని భావించారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఆయన్ను అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారు. దీంతో పాటు కోడెల కార్యలయం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.

tdp leader kodela sivaram house arrested after ready to begin chadranna asaya sadhana padayatra

పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసిన కోడెల శివరాం.. సత్తెనపల్లిలోని కోడెల కార్యలయంలో నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. కోడెల కార్యలయంలో శివరామ్ దీక్ష ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
కోండమోడు &పేరేచర్ల రహదారిని సకాలంలో పూర్తి చేయాలని కోడెల డిమాండ్ చేశారు.

కోటప్పకొండ అభివృద్ధి చేసిన ఘనత కోడెల శివప్రసాదరావుదని, దేవలయాలు అభివృద్ధి చేసి ,కళ్యాణ మండపలు నిర్మాణం చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అచ్చంపేట రోడ్డు లోని ఫ్లెఅవర్ ను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులు పెట్టి , నిర్బందించి ప్రజల మనుస్సులో స్థానం సంపాదించంలేరని వైసీపీ ప్రభుత్వాన్ని కోడెల శివరాం హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+