బీహార్ కంటే దారుణం...ఇద్దరు నేతల హత్యకు యత్నం : నారా లోకేష్

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లను చించి వేసిన ఘటనపై నేడు మాచర్లకు వెళ్ళిన టీడీపీ నేతలు బోండా ఉమా , బుద్దా వెంకన్నల కారుపై కొందరు వైసీపీ కార్యకర్తలు పెద్ద పెద్ద కర్రలతో , రాళ్ళతో , రాడ్లతో దాడి చేసి కార్ల అద్దాలు పగలగొట్టారు. అంతే కాదు టీడీపీ నేతలపై కూడా దాడికి పాల్పడ్డారు .దీంతో మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఈ దాడులను టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు.

టీడీపీ నేతలను హత్యా చేసే ప్రయత్నం చేశారన్న లోకేష్

టీడీపీ నేతలను హత్యా చేసే ప్రయత్నం చేశారన్న లోకేష్

టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్దా వెంకన్నపై వైసీపీ రౌడీ మూకలు దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దుర్మార్గం రాజ్యమేలుతోందని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. ఇద్దరు నేతలను హత్య చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారని పేర్కొన్నారు. హైకోర్టు అడ్వకేట్ కిషోర్‌పై ఘోరంగా దాడి చేశారని ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు . ఏపీలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు.

పోలీసులపైనా వైసీపీ రౌడీలు దాడి చేసే పరిస్థితి వచ్చింది

పోలీసులపైనా వైసీపీ రౌడీలు దాడి చేసే పరిస్థితి వచ్చింది

పోలీసులపైనా వైసీపీ రౌడీలు దాడి చేసే పరిస్థితి వచ్చిందని పేర్కొన్న నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీహార్‌ కంటే దారుణమైన పరిస్థితులు ఏపీలో ఉన్నాయని నారా లోకేష్ పేర్కొన్నారు . ఇక నియంతను కట్టడి చేద్దాం ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకుందాం అని నారా లోకేష్ పేర్కొన్నారు . వైసీపీ రాక్షస పాలనకు ఈ ఘటన పరాకాష్ట అని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.

Recommended Video

    AP Local Body Elections: State Election Commissioner Warns Lawbreakers | Oneindia Telugu
    వైసీపీ నేతలు రాక్షసులను మరపిస్తున్నారు

    వైసీపీ నేతలు రాక్షసులను మరపిస్తున్నారు

    వైసీపీ నేతలు రాక్షసులను మరిపిస్తున్నారని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మాచర్లలో బోండా ఉమ, బుద్దా వెంకన్నల కారుపై దాడులకు తెగబడ్డారన్నారు. మనుషులు ఉన్నా కారుపై దాడి చేశారని పేర్కొన్నారు. వైసీపీ రౌడీలు టీడీపీ నేతల కారును వెంబడించి మరీ దాడులకు పాల్పడ్డారని మాచర్ల నుంచి వెల్దుర్తికి సీఐ కారులో వెళ్తుంటే మళ్లీ దాడి చేశారన్నారు. మాచర్లలో పరిస్థితి తెలుసుకునేందుకు వెళ్లిన లాయర్‌ కిశోర్‌పై కూడా దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+