Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పల్నాడులో హత్యా రాజకీయం .... ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే యరపతినేని సంచలన ఆరోపణలు

గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు . ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆదేశాలతోనే, ఎస్సై బాలనాగిరెడ్డి సహకారంతో అంకులు హత్య జరిగిందని యరపతినేని శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. గురజాల నియోజకవర్గాన్ని మాఫియా రాజ్యంగా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మార్చాడని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపణలు గుప్పించారు .

Recommended Video

    Deputy CM Amjad Basha About Subbayya Murder Case & Slams TDP Over

     టీడీపీ నేతలపై కసి, కక్షతోనే అంకులు హత్య .. మూడు రోజులైనా కేసు పురోగతి లేదు

    టీడీపీ నేతలపై కసి, కక్షతోనే అంకులు హత్య .. మూడు రోజులైనా కేసు పురోగతి లేదు

    మైనింగ్ అక్రమాలపై వ్యవహారంలో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న యరపతినేని శ్రీనివాస్ గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా టిడిపి మాజీ సర్పంచ్ పురం శెట్టి అంకులు హత్య నేపథ్యంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ని టార్గెట్ చేసి సంచలన ఆరోపణలకు తెరతీశారు.

    హత్య జరిగి మూడు రోజులైనా ఈ కేసులో పురోగతి కనిపించలేదని, పల్నాడులో పాశవిక పాలన సాగుతోందని మండిపడ్డారు. కసి, కక్షతోనే అంకులు హత్య జరిగిందని యరపతినేని శ్రీనివాస్ ఆరోపించారు.

    కాసు మహేష్ రెడ్డి అరాచకాలు చేయడానికి వచ్చారా?

    కాసు మహేష్ రెడ్డి అరాచకాలు చేయడానికి వచ్చారా?

    పోలీసులు కాసు మహేష్ రెడ్డి కి కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు.

    పల్నాడు లో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని నరసరావుపేట రాజకీయాలు పల్నాడులో సాగనివ్వమని మండిపడ్డారు. గురజాలకు వలస వచ్చిన కాసు మహేష్ రెడ్డి అరాచకాలు చేయడానికి వచ్చారా అంటూ ప్రశ్నించారు. కాసు మహేష్ రెడ్డి పల్నాడు ను మాఫియా రాజ్యంగా మారుస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే యరపతినేని.

     కాసు మహేష్ రెడ్డి , ఆయన అనుచరుల అరాచకాల చిట్టా చెప్పిన యరపతినేని

    కాసు మహేష్ రెడ్డి , ఆయన అనుచరుల అరాచకాల చిట్టా చెప్పిన యరపతినేని

    అనేక హత్యా నేరాలలో కాసు మహేష్ రెడ్డి పాత్ర ఉందని, ఎమ్మెల్యే అయిన తర్వాత నలుగురిని హత్య చేయించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 85 మంది టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయించారని, అయినప్పటికీ పోలీసులు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాసు మహేష్ రెడ్డి , ఆయన అనుచరుల అరాచకాల చిట్టా విప్పారు. పెదగార్లపాడు లో ముస్లిం మైనర్ బాలికపై కాసు అనుచరుడు అత్యాచారం చేశాడని, పిడుగురాళ్ల లో బీసీ వైద్యుని చితకబాది కాసు మహేష్ రెడ్డి అనుచరులు హోమో సెక్స్ కు పాల్పడ్డారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

     కాసు మహేష్ రెడ్డి నరహంతకుడిలా దారుణ మారణ కాండ.. పోలీసుల సహకారం

    కాసు మహేష్ రెడ్డి నరహంతకుడిలా దారుణ మారణ కాండ.. పోలీసుల సహకారం


    కాసు మహేష్ రెడ్డి నరహంతకుడిలా దారుణ మారణ కాండ చేస్తున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ విమర్శించారు.

    వ్యవస్థను కాపాడాల్సిన పోలీసులు, మేక వన్నె పులి గా వ్యవహరిస్తున్న కాసు మహేష్ రెడ్డి కి సహకరిస్తూ హత్యలు చేయిస్తున్నారని వ్యాఖ్యానించారు. పల్నాడు నుండి కాసు మహేష్ రెడ్డి ని తరిమివేయడానికి పల్నాడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యలు చేశారు . టీడీపీ నేత అంకులు హత్య కేసును త్వరగా తేల్చాలని, నిందితులను త్వరగా పట్టుకోవాలని టిడిపి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+