అక్కడ వైసీపీ గెలుపును టీడీపీ అడ్డుకుంటుందా?
Prathipadu Assembly round up 2024: గుంటూరు జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి- ప్రత్తిపాడు. ప్రస్తుతం ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండానే ఎగురుతోంది. పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి రెండుసార్లు విజయం సాధించిందిక్కడ. మూడో సారి పాగా వేయాలనే పట్టుదలతో ఉంది.
గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వచ్చిన నియోజకవర్గం ఇది. మాకినేని పెదరత్తయ్య వరుసగా అయిదుసార్లు ఇక్కడ గెలిచారు. 2004లో తొలిసారిగా ఇక్కడ ఓడింది టీడీపీ. ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. మళ్లీ ఇక్కడ గెలవడానికి పదేళ్లు పట్టింది టీడీపీకి. 2012లో వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టింది ప్రత్తిపాడు. 2014లో టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు ఘన విజయం సాధించారు. 2019లో మళ్లీ వైసీపీ దక్కించుకుంది.

గుంటూరు లోక్‌సభ పరిధిలోని ఎస్సీ రిజర్వుడు సీటు ఇది. 2004 వరకు జనరల్ సీటుగా ఉండేది. 2009 నుంచి ఎస్సీ రిజర్వుడు మారింది. గుంటూరు రూరల్, కాకుమాను, ప్రత్తిపాడు, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. 2,50,247 మంది ఓటర్లు ఉన్నారు.
సంఖ్యాపరంగా కమ్మ, ఎస్సీ, కాపు, రెడ్డి సామాజిక వర్గాల వారు ప్రధానంగా ఉంటారు. రాజకీయంగా మాత్రం కమ్మ వారే కీలక పాత్ర పోషిస్తోన్నారు. టీడీపీ ఆవిర్భవించక ముందు నాలుగు ఎన్నికలు జరగాయి ప్రత్తిపాడులో. మూడుసార్లు కాంగ్రెస్ గెలిచింది. స్వతంత్ర పార్టీ అభ్యర్థి ఒకసారి విజయం సాధించారు.
టీడీపీ ఆవిర్భవించాక ఒక ఉప ఎన్నికతో కలిపి మొత్తం 10 సార్లు ఎన్నికలు జరిగాయి. టీడీపీ ఆరుసార్లు, కాంగ్రెస్ రెండుసార్లు విజయం సాధించాయి. వైఎస్ఆర్సీపీ కూడా రెండు సార్లు ఈ నియోజకవర్గాన్ని సొంతం చేసుకుంది. మాకినేని పెద రత్తయ్య టీడీపీ తరఫున అయిదుసార్లు విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ తరఫున రావి వెంకటరమణ గెలిచారు.
ఆ తరువాత అంటే 2009 నాటికి ఎస్సీ రిజర్వుడ్ సీటు అయింది ప్రత్తిపాడు. కాంగ్రెస్ తరఫున మేకతోటి సుచరిత 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో ఆమె కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. 2011లో రాజీనామా చేసి వైసీపీ అభ్యర్ధిగా ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. మళ్లీ 2019లోన ఆమెనే గెలిచారు. హోం మంత్రిగా పని చేశారు.
2009 ఎన్నికలలో సుచరిత టీడీపీకి చెందిన కందుకూరి వీరయ్యపై 2,042 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో టీడీపీ అభ్యర్ధి రావెల కిషోర్ బాబు చేతిలో 7,405 ఓట్ల మెజారిటీ ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మళ్లీ సుచరితే విజయం సాధించారు. అప్పటి టీడీపీ అభ్యర్ధి డొక్కా మాణిక్య వర ప్రసాద్ మీద 7,398 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
ఈ ఎన్నికల నాటికి రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది ప్రత్తిపాడులో. అటు వైసీపీ, ఇటు టీడీపీ కొత్త అభ్యర్థులను బరిలోకి దించాయి. సుచరిత.. తాడికొండ నుంచి బరిలో దిగారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన రావెల కిశోర్ బాబు, డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇప్పుడు వైసీపీలో ఉన్నారు.
ఈ సారి వైసీపీ అభ్యర్థిగా బాలసాని కిరణ్ కుమార్ బరిలో నిలిచారు. టీడీపీ తరఫున రిటైర్డ్ ఐఎఎస్ అధికారి బూర్ల రామాంజనేయులు పోటీ చేస్తోన్నారు. గతంలో ఆయన గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. ఈ సారి ప్రత్తిపాడు ఎవరికి పట్టం కడుతుందనేది ఉత్కంఠభరితంగా మారింది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications