ఏపీ సీఎం జగన్ కు బాలయ్య రిక్వెస్ట్ .. ఏమడిగారో తెలుసా ?

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏపీ సర్కార్ పనితీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రత్యేక విజ్ఞప్తి కూడా చేశారు బాలయ్య. రాయలసీమ అభివృద్ధి కోసం తన శరీరంలో రక్తం బొట్టు ఉన్నంత వరకు కష్టపడతానని పేర్కొన్న నందమూరి బాలకృష్ణ హిందూపురంలో పర్యటిస్తున్నారు.

హిందూ పురంలో మూడు రోజుల పాటు బాలకృష్ణ పర్యటన

హిందూ పురంలో మూడు రోజుల పాటు బాలకృష్ణ పర్యటన

హిందూపురం నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బాలకృష్ణ మూడు రోజుల పాటు నియోజకవర్గంలోనే పర్యటించనున్నారు. మూడు రోజులపాటు నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు బాలకృష్ణ. స్థానిక టిడిపి నేతలతో సమావేశమై పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు. ఈరోజు లేపాక్షిలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హిందూపురం నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చాలని జగన్ కు విజ్ఞప్తి చేసిన బాలయ్య

హిందూపురం నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చాలని జగన్ కు విజ్ఞప్తి చేసిన బాలయ్య

తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ప్రకటించారు. ప్రస్తుతం ఏపీ సీఎం ఏపీ రాష్ట్రాన్ని లోక్ సభ నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాల పునర్విభజన చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు అధికారులు . దీంతో బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గాన్ని హిందూపురం జిల్లాగా మార్చాలని, ఇది హిందూపురం వాసుల కోరిక అని పేర్కొన్నారు. ఇక ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని బాలయ్య తెలిపారు. సీఎం జగన్ దృష్టికి తన రిక్వెస్ట్ ను తీసుకు వెళ్తానని చెప్పిన బాలయ్య రాయలసీమ ప్రాంత అభివృద్ధి తన ధ్యేయమని తన శరీరంలో రక్తం బొట్టు ఉన్నంత వరకు రాయలసీమ అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఏపీ ప్రభుత్వ పని తీరుపై విమర్శలు గుప్పించిన బాలకృష్ణ

ఏపీ ప్రభుత్వ పని తీరుపై విమర్శలు గుప్పించిన బాలకృష్ణ

అంతేకాదు ఏపీ ప్రభుత్వ పనితీరుపై ఆయన విమర్శలు చేశారు. బాలయ్య ప్రసంగిస్తున్న సమయంలో కరెంట్ కట్ అయింది. దీంతో బాలయ్య ఏపీ ప్రభుత్వం పై సెటైర్లు వేశారు. కరెంటు కోతలు, వేరుశనగ రైతుల ఇబ్బందులు అన్ని మొదలయ్యాయని ఆయన ఏపీ సర్కార్ పనితీరుపై విమర్శలు గుప్పించారు. ఇక ఇదేనా ప్రభుత్వ పరిపాలన తీరు అని బాలయ్య ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+