Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ex lover: భర్తకు హ్యాండ్ ఇచ్చి ఎస్కేప్, ప్రియుడితో కలిసి కొండ మీదనుంచి లోయలో దూకిన లేడీ !

బెంగళూరు: మూడు సంవత్సరాల నుంచి యువతి, యువకుడు ప్రేమించుకుని హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ఇద్దరూ పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉండాలని అనుకున్నారు. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు మరో యువకుడితో బలవంతంగా ఆమె పెళ్లి జరిపించేశారు. భర్తతో కాపురం చేస్తున్న భార్య అప్పుడప్పుడు ఆమె మాజీ ప్రియుడిని కలిసి అతనితో ఎంజాయ్ చేసింది. భార్య అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న భర్త ఆమెను మందలించాడు. వివాహం జరిగిన సంవత్సరం తరువాత భార్య ఆమె ప్రియుడితో కలిసిపారిపోయింది. ఎత్తైన కొండ మీదకు ప్రియుడితో కలిసి వెళ్లిన వివాహిత మహిళ ఆక్కడి నుంచి ఇద్దరూ దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న మూడు రోజుల తరువాత విషయం వెలుగు చూడటంతో ఆమె బంధువులు షాక్ అయ్యారు.

 ప్రేమికులు

ప్రేమికులు

బెంగళూరు నగర శివార్లలోని కనకపురలో నివాసం ఉంటున్న చందనా (21) అనే యువతి, తమిళనాడులోని హోసూరు పట్టణంలో నివాసం ఉంటున్న సతీష్ (21) అనే యువకుడికి పరిచయం ఉంది. మూడు సంవత్సరాల నుంచి చందనా, సతీష్ ప్రేమించుకుని హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేశారు. చందనా, సతీష్ పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉండాలని అనుకున్నారు.

 బలవంతంగా యువతి పెళ్లి చేశారు

బలవంతంగా యువతి పెళ్లి చేశారు

సతీష్ వివాహం చేసుకోవడానికి చందనా కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. సంవత్సరంక్రితం చందనా కుటుంబ సభ్యులు రాజేష్ అనే యువకుడితో బలవంతంగా ఆమె పెళ్లి జరిపించేశారు. భర్త రాజేష్ తో చందనా ఇష్టం లేకుండా కాపురం చేస్తున్నది. ప్రియుడు సతీష్ మరిచిపోలేని చందనా భర్త రాజేష్ తో అంటిముట్టనట్లు ఉంటున్నదని సమాచారం.

 సీక్రేట్ గా ప్రియుడిని కలుస్తున్న చందనా

సీక్రేట్ గా ప్రియుడిని కలుస్తున్న చందనా

చందనా అప్పుడప్పుడు పుట్టింటికి, ఆమె బంధువుల ఇంటికి వెళ్లి వచ్చే సమయంలో ఆమె ప్రియుడు సతీష్ తో ఎంజాయ్ చేసింది. భార్య చందనా అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న ఆమెను భర్త రాజేష్ మందలించాడు. భర్త రాజేష్ తో పాటు కుటుంబ సభ్యులు మందలించినా చందనా మాత్రం ఆమె ప్రియుడిని మరిచిపోలేకపోయింది.

 ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న వివాహిత మహిళ

ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న వివాహిత మహిళ

వివాహం జరిగిన సంవత్సరం తరువాత చందనా ఇంటి నుంచి ఆమె ప్రియుడు సతీష్ దగ్గరకు పారిపోయింది. భర్త రాజేష్ తన భార్య కనపడటం లేదని కనకపుర పోలీస్ స్టేషన్ లో మూడు రోజుల క్రితం మిస్సింగ్ కేసు పెట్టాడు. అప్పటి నుంచి బంధువులు, కుటుంబ సభ్యులు చందనా కోసం గాలిస్తూనే ఉన్నారు.

Recommended Video

    తన ఇంటిపై దాడిన అడ్డుకున్న కార్యకర్తలపై అక్రమకేసులు ఎత్తేయాలన్న రేవంత్ రెడ్డి!!
     కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య

    కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య

    రామనగర జిల్లాలోని కబ్బాళు సమీపంలోని ఎత్తైన కొండ మీదకు ప్రియుడు సతీష్ తో కలిసి వెళ్లిన వివాహిత మహిళ చందనా ఆక్కడి నుంచి లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. చందనా, సతీష్ ఆత్మహత్య చేసుకున్న మూడు రోజుల తరువాత స్థానికులు విషయం గుర్తించి పోలీసుకు సమాచారం ఇచ్చారు. ప్రియుడు సతీష్ తో కలిసి చందనా ఆత్మహత్య చేసుకుందని వెలుగు చూడటంతో ఆమె బంధువులు, భర్త రాజేష్ షాక్ అయ్యారు. చందనా, సతీష్ వివాహం చేసుకోవాలని అనుకున్నా మొండిగా ఆమె కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో వివాహం చెయ్యడం వలనే వారు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద ప్రియుడు సతీష్ తో కలిసి చందనా ఆత్మహత్య చేసుకోవడంతో మూడు కుటుంబాల్లో విషాదచాయలు నెలకొన్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+