తెలంగాణ పాఠశాలల విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో రాగిజావ అందించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 20న నిర్వహించే విద్యా దినోత్సవం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పహారంగా రాగిజావ అందించనున్నారు.

ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విద్యా శాఖ పనితీరు, విద్యా దినోత్సవంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సబితా ఇంద్రారెడ్డి ఈ విషయాలను వెల్లడించారు. ప్రతిరోజూ ప్రార్థనా సమయానికి ముందే ప్రతి విద్యార్థికి 250 మిల్లిలీటర్ల రాగిజావ అందిస్తామని తెలిపారు. దీంతో 28,606 ప్రభుత్వ పాఠశాలల్లోని 25,26,907 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

250 ml of ragi java will be provided daily before prayer time in all schools: minister Sabitha Indra reddy

మరోవైపు, ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న
16,27,457 మంది విద్యార్థులకు మూడేసి చొప్పున వర్క్ బుక్స్, ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న 12,39,415 మంది విద్యార్థులకు సబ్జెక్టుకు ఒకో నోటు పుస్తకం చొప్పున అందిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డితెలిపారు. 1,600 పాఠశాలల్లో నిర్మించిన 4,800 డిజిటల్‌ తరగతులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

30 లక్షల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందిచనున్నట్టు వెల్లడించారు. 26 లక్షల మంది విద్యార్థులకు రెండేసి జతల యూనిఫామ్‌లను అందిస్తామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కాగా, జూన్ 12 నుంచి తెలంగాణలో పాఠశాలల ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాఠశాలలు విద్యార్థుల కోసం ముస్తాబవుతున్నాయి. వినూత్న కార్యక్రమాలతో విద్యార్థులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు ముందుకు వస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+