16 మంది చిన్నారులు.. బట్టలూడదీసి మరీ దాడి.. ఎక్కడంటే
చిన్నారులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆ కారణంగా వారిపై దాడి చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ ఘటన జరిగింది. మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు యువకులు రెచ్చిపోయారు. తమ ప్రతాపాన్ని చిన్నారులపై చూపించారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలియడంతో పేరంట్స్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
16 మంది చిన్నారులపై దాడి చేశారు. ఎందుకు దాడి చేశారనే అంశంపై స్పష్టత లేదు. అంటే దొంగతనం.. మరేదైనా కారణం ఉందా అనే విషయం బయటకు తెలియరాలేదు. కానీ ఆ చిన్నారుల దుస్తులు ఊడదీసి మరీ కొట్టారు. ఇందులో ప్రధానంగా ముగ్గురు వ్యక్తుల పాత్ర ఉంది. తీవ్రంగా కొట్టడంతో చిన్నారులు గాయపడ్డారు. చిన్నారులకు గాయాలు కావడంతో పేరంట్స్ మండిపడుతున్నారు.

ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. కేసు విచారణలో ఉందని సీఐ రవి తెలిపారు. దాడికి పాల్పడిన ముగ్గురు యువకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే నిందితుల్లో బీజేపీ నేతలు లేరని ఆయన కామెంట్ చేశారు. దీంతో ఆ ముగ్గురికి ఏ పార్టీతో సంబంధం ఉందనే అంశం తెరపైకి వచ్చింది.
చిన్నారులపై దాడి చేయడం మాత్రం సరికాదు. ఏదో కారణంతో అటాక్ చేయడం.. అదీ కూడా బట్టలు లేకుండా కొట్టి.. పైశాచిక ఆనందం పొందారు. దీనిపై పేరంట్స్, ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్నారులపై ఇలా దారుణంగా ప్రవర్తించడం మంచి పద్దతి కాదని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications