ఈ సారి కూడా స్పెషల్ బస్సులు.. 4035 సర్వీసులు, ఎప్పటిలాగే 50 శాతం ఎక్కువ ఛార్జీ
దసరా.. తెలంగాణలో పెద్ద పండగ.. పండగకు కంపల్సరీ ఊరికి వెళ్లాల్సిందే. అందుకోసం ఆర్టీసీ ప్రత్యేంకగా బస్సులను నడిపిస్తూ ఉంటుంది. ఈ సారి కూడా స్పెషల్ బస్సులనే వేసింది. ప్రత్యేక బస్సులకు అదనపు చార్జీలు వసూలు చేస్తామని అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటకకు కూడా సర్వీస్ ఉంటుంది. ఈ నెల 8 నుంచి 14 వరకు ప్రత్యేక బస్సులు నడిపిస్తారు. ప్రత్యేక బస్సులలో టికెట్ ఛార్జీకి అదనంగా 50 శాతం రుసుము వసూలు చేస్తారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తామని వివరించారు.

దసరా పండగకు 4035 ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు. మహాత్మ గాంధీ బస్సు స్టేషన్ నుంచి 3,200 బస్సులు, జేబీఎస్ నుంచి 1200 బస్సులు తెలంగాణ, ఏపీకి నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీని బట్టి మరికొన్ని బస్సులు అదనంగా తిప్పేందుకు అధికారులు నిర్ణయించారు. ఏపీతోపాటు తెలంగాణలోని ఖమ్మం, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్‌కు ప్రాంతాలకు ముందస్తు బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించారు. కరీంనగర్,ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ బస్సులు జేబీఎస్ నుంచి బయలుదేరుతుండగా.. వరంగల్, మహబూబాబాద్‌కు వెళ్లే బస్సులు ఉప్పల్ నుంచి బయలు దేరనున్నాయి.
ఇటు ఆర్టీసీ సంస్థ ఆదాయం పెంచేందుకు అధికారులతో ఎండీ సజ్జనార్ సమావేశాలు నిర్వహించి.. సలహాలు తీసుకుంటున్నారు. వాస్తుపై కూడా దృష్టిసారించారు. సంస్థ నష్టాల్లో ఉండడానికి వాస్తు కూడా ఓ కారణమని సజ్జనార్ భావించినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ భవన్ దక్షిణ గేటు క్లోజ్ చేసి, తూర్పు మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. సంస్థ ఆదాయం పెంచడంతో, సౌకర్యాలపై ప్రజల నుంచే సలహాలు తీసుకునేందుకు ఓ ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించారు.
Recommended Video
ప్రయాణికుల నుంచి సూచనలు, సలహాలు, ఆర్టీసీలో ఎదురయ్యే ఇబ్బందులు, ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించారు. అందుకోసం ఓ ట్విటర్ ఖాతాను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు తమ అమూల్యమైన సలహాలను tsrtc.telangana.gov.in ట్విటర్‌లో పంచుకోవాలని సూచించారు. ప్రయాణికుల సూచనలతో ఆర్టీసీలో మార్పులు చేర్పులు చేయనున్నట్టు తెలిపారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications