హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

45 వేల పైచిలుకు మందికి లక్షణాలు, ఐసోలేషన్ కిట్స్ అందజేత..

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి తర్వాత కేసులు తగ్గుముఖం పడతాయని నిపుణులు చెబుతున్నా.. కేసుల వర్రీ ఎక్కువగానే ఉంది. ఇటు తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అలర్ట్ అయ్యింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే చేపట్టారు.

ఫీవర్ సర్వే

ఫీవర్ సర్వే

శుక్రవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఫీవర్ సర్వే కొనసాగుతోంది. తెలంగాణలోని అన్నీ జిల్లాలో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించి, హోమ్ ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. ఒక్కరోజు ఫీవర్ సర్వేలో 45 వేల 567 మందికి లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు.

 ప్రతీ ఇంట్లో ఒక్కరికీ

ప్రతీ ఇంట్లో ఒక్కరికీ

రాష్ట్రంలో దాదాపు ప్రతి ఇంట్లో ఏదొ లక్షణాలతో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పితోపాటు ఏదొక లక్షణాలతో బాధ పడుతున్న వారి సంఖ్య 45,567 మందిగా గుర్తించారు. లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందజేశారు. ఇంటింటి ఫీవర్ సర్వేలో చిన్నారులు, పెద్దవారిని విడివిడిగా వివరాలు సేకరిస్తున్నారు. ఎక్కువ శాతం పెద్దవారిలోనే కరోనా లక్షణాలు గుర్తించారు.

5 రోజులు ఫాలొ అప్

5 రోజులు ఫాలొ అప్

కోవిడ్ తీవ్ర లక్షణాలు ఉంటే టెస్ట్ చేసి 5 రోజుల పాటు బాధితులను సిబ్బంది ఫాలో అప్ చేస్తున్నారు. లక్షణాలు మరింత ఎక్కువగా ఉంటే వైద్య సిబ్బంది కరోనా బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఫీవర్ సర్వే మరో 6 రోజులపాటు కొనసాగనుంది. మొన్నటివరకూ టెస్టింగ్ సెంటర్ల వద్ద భారీ క్యూలు కనిపించేవి. ఇప్పుడు ఇంటింటికి ఆరోగ్య శాఖ సిబ్బంది వెళ్లడంతో టెస్టింగ్ సెంటర్ల వద్ద రద్దీ తగ్గుతోంది. శుక్రవారం హెల్త్ బులిటెన్‌లో 4 వేల 416 పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.

టెన్షన్.. టెన్షన్

టెన్షన్.. టెన్షన్

కరోనా తోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. ఇక ఒమిక్రాన్ వేరియంట్ వలన ప్రాణాపాయం చాలా తక్కువని, మైల్డ్ సింటమ్స్ మాత్రమే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు.కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ నెల ఆఖరు.. ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖులను కూడా కేసులు వదలడం లేదు. హెల్త్ వర్కర్లు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కరోనా సోకుతుంది.

English summary
45 thousand above people are covid symptoms in telangana fever survey revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X