తెలంగాణలో 453 కరోనా కేసులు: ముగ్గురు మృతి

కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా తగ్గుతున్నాయి. ఏపీలో హెచ్చు తగ్గులు ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తగ్గుముఖం పడుతున్నయి. రోజువారి నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా తగ్గుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 453 కరోనా కేసులు వచ్చాయి. కరోనా సోకిన ముగ్గురు చనిపోయారు. గత 24 గంటల్లో కరోనా సోకిన.. 591 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 8,137 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 6, భద్రాద్రి కొత్తగూడెం 10, జీహెచ్ఎంసీ 82, జగిత్యాల 19, జనగామ 8, జయశంకర్ భూపాలపల్లి 5, గద్వాల 1, కామారెడ్డి 2, కరీంనగర్ 61, ఖమ్మం 26, మహబూబ్‌నగర్ 5, ఆసిఫాబాద్ 3, మహబూబాబాద్ 7, మంచిర్యాల 13, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 23, ములుగు 6, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 35, నారాయణపేట 3, నిర్మల్ 5, నిజామాబాద్ 6, పెద్దపల్లి 25, సిరిసిల్ల 13, రంగారెడ్డి 25, సిద్దిపేట 11, సంగారెడ్డి 6, సూర్యాపేట 17, వికారాబాద్ 1, వనపర్తి 4, వరంగల్ రూరల్ 5, వరంగల్ అర్బన్ 41, యాదాద్రి భువనగిరిలో 9 చొప్పున కేసులు నమోదయ్యాయి.

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

453 people infected corona in telangana

Recommended Video

    Eta Variant In India ఇప్పటికే పలు వేరియంట్లు | Kerala | COVID 19 Vaccination || Oneindia Telugu

    వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. డిసిషన్ తీసుకోవాల్సి ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+