బర్త్ డే పార్టీపై గొడవ, ఐదుగురు స్టూడెంట్స్ సూసైడ్ అటెంప్ట్

విద్యార్థినుల మధ్య గొడవ సూసైడ్ అటెంప్ట్‌కు దారితీసింది. వరంగల్ జిల్లాలో జరిగిన ఘటన కలకలం రేపింది. బర్త్ డే పార్టీ మీద వివాదం నెలకొంది. వరంగల్ జిల్లాలో గల ఆరెపల్లి రెసిడెన్షియల్ స్కూల్‌కు చెందిన పదో తరగతి బాలికలు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇప్పుడు వారి పరిస్థితి స్థిమితంగానే ఉందని ప్రిన్సిపల్ తెలియజేశారు.

బాలికల హాస్టల్‌లో విద్యార్థిని బర్త్ డే వేడుకలు జరిగాయి. పార్టీకి హాస్టల్ విద్యార్థులు కాక బయటివారు ఎక్కువగా వచ్చారట. దీనిపై హాస్టల్ అధికారులు విద్యార్థినులను మందలించారు. ఆ అంశంపై విద్యార్థినుల మధ్య గొడవ జరిగింది. మనస్థాపానికి గురై ఐదుగురు విద్యార్థినిలు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

5 students are suicide attempt in the warangal hostal.

విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో.. హాస్టల్ సిబ్బంది వెంటనే వారిని వరంగంల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వారికి అత్యవసర చికిత్స అందుతోంది. ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి బాగానే ఉందని ప్రిన్సిపల్ తెలిపారు. చిన్న విషయానికే గొడవ పడ్డారని.. అఘాయిత్యానికి ప్రయత్నించారని తెలిపారు. కోలుకున్నాక వారికి కౌన్సిలింగ్ ఇస్తామని చెబుతున్నారు.

పేరంట్స్‌ను వదిలి హాస్టల్‌లో ఉంటున్న స్టూడెంట్స్ చక్కగా చదువుకోవాలి. బర్త్ డే పార్టీలకు హాస్టల్ సిబ్బంది అనుమతించకూడదు. ఇక బయటి వారిని అలో ఎలా చేశారో తెలియదు. ఇవన్నీ సశేష ప్రశ్నలే. దాని మధ్య వారికి గొడవ జరగడం.. సూసెడ్ అటెంప్ట్ వరకు వెళ్లింది. దీనిపై ఉన్నతాధికారులు రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+