హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Hyderabad: డిసిప్లిన్‌గా ఉండే దేశం నుంచి డిసిప్లిన్‌లేని చోటకు తీసుకొచ్చా..!

|
Google Oneindia TeluguNews

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని ఎంత చెప్పినా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. వాహనాలు నడపాలని వారే ప్రోత్సహిస్తున్నారు. తాజాగా మైనర్ల ర్యాష్ డ్రైవింగ్ కారణంగా 13 బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో జరిగింది. శ్రీశాంత్ రెడ్డి అనే బాలుడు ఆదివారం సాయంత్రం సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు మైనర్లు బైక్ పై వేగంగా వచ్చి బాలుడిని ఢీకొట్టారు.

న్యూజిలాండ్ లోనే పుట్టాడు

న్యూజిలాండ్ లోనే పుట్టాడు


ఈ ప్రమాదంలో శ్రీశాంత్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కానీ ఆ బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. బాలుడి మృతి స్థానికంగా విషాదం నెలకొంది. శ్రీశాంత్ రెడ్డి తల్లిదండ్రులు సురేందర్ రెడ్డి, స్వర్ణలక్ష్మి న్యూజిలాండ్ లో స్థిరపడ్డారు. వీరికి న్యూజిలాండ్ సిటిజన్ షిప్ ఉంది. శ్రీశాంత్ న్యూజిలాండ్ లోనే పుట్టాడు.

భారత సంస్కృతి

భారత సంస్కృతి


అయిత కుమారుడికి భారత సంస్కృతి గురించి తెలుసుకోవడానికి సురేందర్ రెడ్డి శ్రీశాంత్ రెడ్డిని ఇండియాకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో శ్రీశాంత్ రెడ్డి మైనర్ల రాష్ డ్రైవింగ్ కు బలయ్యాడు. శ్రీశాంత్ మరణ వార్త తల్లి స్వర్ణలక్ష్మి తెలియదు. ఆమె ఈ రోజు రాత్రికి హైదరాబాద్ రానున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా


కొడుకు మరణంతో తండ్రి సురేందర్ రెడ్డి విలపిస్తున్నాడు. అతన్ని చూసిన స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. నా కుమారుడు అంటే నాకు ప్రాణమని సురేందరు వాపోయారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో చదువుతున్న నా కొడుకును ఈ దేశంపై ఉన్న అభిమానంతో ఇక్కడికి తీసుకొచ్చానని చెప్పారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు పిల్లలకు తెలియాలని ఇక్కడ చదివేందుకు తీసుకొచ్చానని విలపించారు. చివరకు నా కొడుకు మైనర్‌ల డ్రైవింగ్‌కు బలయ్యాడని కన్నీరుమున్నీరయ్యారు. చివరకు నా కొడుకు మైనర్‌ల డ్రైవింగ్‌కు బలయ్యాడని కన్నీరుమున్నీరయ్యారు. తన కొడుకును డిసిప్లిన్‌గా ఉండే దేశం నుంచి తానే డిసిప్లిన్‌లేని చోటకు తీసుకొచ్చినట్లుందని ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Parents don't care no matter how much they say not to give vehicles to minors. They themselves are encouraged to drive vehicles. Recently, 13 boys lost their lives due to rash driving by minors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X