జూబ్లీహిల్స్‌లో తుపాకీతో కాల్చుకుని వైద్యుడు ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలోని విషాద ఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12లో డాక్టర్ మజార్ అలీ తుపాకీతో పాయింట్ బ్లాంక్‌లో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
హైదరాబాద్: నగరంలోని విషాద ఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12లో డాక్టర్ మజార్ అలీ తుపాకీతో పాయింట్ బ్లాంక్‌లో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే మజార్ అలీని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ కలహాల కారణంగానే మజార్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆత్మహత్యకు పాల్పడిన వైద్యుడు.. ఓ ఎంఐఎం ఎమ్మెల్యేకు బంధువు అని తెలిసింది.

ఉరేసుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
వికారాబాద్ జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ హెడ్ కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. హెడ్ కానిస్టేబుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మృతుడిని వికారాబాద్ డీటీసీలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నరసింహస్వామిగా పోలీసులు గుర్తించారు. స్వామి అంత్యక్రియలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. స్వామి మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications