Hyderabad: కుషాయిగూడలో విషాదం.. ఆత్మహత్యకు పాల్పడ్డ కుటుంబం..

హైదరాబాద్ లోని కుషాయిగూడలో విషాదం నెలకొంది. శనివారం మధ్యాహ్నం ఓ కుటుంబం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. నిజమాబాద్ కు చెందిన గాదె సతీష్ అనే వ్యక్తి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. అతనికి సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ కు చెందిన వేదతో 2012లో పెళ్లి అయింది. వారికి ఇద్దరు కుమారులు 9 ఏళ్ల నిషికేత్, 5 ఏళ్ల నిహాల్ ఉన్నారు. అయితే ఇద్దరు కొడుకు నిషికేత్, నిహాల్ బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది.

వారు కోసం ఎంత ఖర్చు చేసిన లాభం లేకపోయింది. దీంతో పిల్లలను చూసుకోవడానికి వారికి ఇబ్బందిగా మారింది. కళ్ల ముందే పిల్లలు ఇబ్బంది పడుతుంటే వారు తట్టులేకపోయారు. దీంతో సతీష్ ఇద్దరి కొడులకు కూల్ డ్రింక్ పోటాషియం సైనెడ్ కలిపి తాగించాడు. అనంతరం భార్యాభర్తలు ఇద్దరు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే వారు బంధువులు ఎవరు ఫోన్ చేసినా స్పందించకపోవడం, ఇంటి తలుపులు మూసి ఉండడంతో అనుమానం వచ్చిన బంధువులు, స్థానికులు తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లారు.

 A Four members family commited suicide by Consuming poison in hyderabad kushayguda

లోపలికి వెళ్లి చూడగా.. బెడ్ రూమ్ మూలన సతీష్ అచేతనంగా పడి ఉన్నాడు. భార్య, పిల్లలు బెడ్ పై విగతజీవులుగా పడి ఉన్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

సతీష్, వేద దంపతుల కుమారులు నిషికేత్, నిహాల్ అటిజంతో బాధపడుతున్నారని పోలీసులు తెలిపారు. పిల్లలను ఏ వైద్యుడికి చూపించిన నయం కాకపోవడంతో దంపతులు ఆందోళనకు గురయ్యారని చెప్పారు. దీంతో శనివారం ఉదయం పిల్లలకు విషమిచ్చిన సతీష్.. తర్వాత తాను, భార్యకు ఇచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న గదిలో లేఖ లభ్యమైనట్లు పోలీసులు చెప్పారు. "మా నలుగుర్ని కాపాడాలని ప్రయత్నించొద్దు. ప్రశాంతంగా చనిపోనివ్వండి" అని లేఖలో రాసినట్లు తెసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+