ఈ జిల్లాలలో నేడు, రేపు భారీ వర్షాలు.. హెచ్చరిక!

తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభం అయినా చెప్పుకోదగ్గ వర్షాలు పడటం లేదు. ఈసారి వర్షాలపై ఎల్ నినో ప్రభావం ఉంటుందని, తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా వాతావరణం ప్రస్తుతం చల్లబడింది.

నేడు, రేపు ఉత్తర తెలంగాణా జిల్లాలలో వర్షాలు

భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అదనంగా ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు ఒక ద్రోణి మరియు ఉత్తర కోస్తా ఆంధ్ర నుంచి మహారాష్ట్ర వరకు మరో ద్రోణి విస్తరించి ఉన్నాయి. ఈ వ్యవస్థల ప్రభావంతో సోమవారం మరియు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి.

Telangana rains IMD Issues Yellow Alert for Several Districts in telangana with heavy rains

ఈ జిల్లాలలో నేడు భారీ వర్షాలు

నేటి వాతావరణ పరిస్థితుల్లో ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది.

నిన్న ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

ఆదివారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతలలో 7.8 సెంటీమీటర్లు, ములుగు జిల్లా ఏటూరునాగారంలో 7.3 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా మొగ్ధంపల్లిలో 5.7 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఇతర ప్రాంతాల్లో కూడా 5 సెంటీమీటర్లకు మించిన వర్షాలు పడ్డాయి.ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు మెరుపుల సమయంలో సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని, చెట్ల క్రింద నిలబడకూడదని అధికారులు సూచించారు.

మహిళా స్వయం సహాయక సంఘాలకు త్వరలో రైస్ మిల్లులు.. శుభవార్త!
మహిళా స్వయం సహాయక సంఘాలకు త్వరలో రైస్ మిల్లులు.. శుభవార్త!

రైతన్నలకు వర్షాలతో ప్రయోజనం

వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో రోడ్డు ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచిస్తున్నారు. వ్యవసాయ పనులు చేసేవారు కూడా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ వర్షాలు రైతన్నలకు మంచి ప్రయోజనం కల్పించవచ్చని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+