భార్య శీలాన్ని శంకించి.. నిండు గర్భిణిని చంపుకున్నారు..

అది కొత్త జీవితానికి నాంది పలకాల్సిన సమయం. కడుపులో ఎదుగుతున్న బిడ్డకు నెలలు నిండకముందే సీమంతం చేసి, సంబరం చేయాలని ఆ తల్లిదండ్రులు కలలు కన్నారు. కానీ, ఆ కలలన్నీ ఒక్క రాత్రిలోనే రక్తపు మరకలుగా మారిపోయాయి. భార్య శీలాన్ని శంకిస్తూ, కడుపులోని బిడ్డ తనది కాదేమోనని డీఎన్ఏ టెస్ట్ చేయాలంటూ భర్త చేసిన వికృత ప్రయోగం.. చివరకు ఒక నిండు గర్భిణి ప్రాణాన్ని బలిగొంది.

పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా మోత్కుపల్లి గ్రామానికి చెందిన జి. సుస్మిత (23)కు, మెదక్ జిల్లాకు చెందిన గాజుల వ్యాపారి జి. అభిలాష్‌తో దాదాపు 18 నెలల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో కట్నకానుకలు సమర్పించినప్పటికీ, పెళ్లయిన కొద్దిరోజుల నుంచే సుస్మితను భర్త, అత్త లక్ష్మి అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం సుస్మిత ఐదు నెలల గర్భిణి కావడంతో పుట్టింటివారు సీమంతం వేడుకలకు సిద్ధమయ్యారు.

Beyond Heartbreaking Pregnant Woman Takes Her Life After Husband Questions Paternity Of Unborn Child

సీమంతం వేడుక ఏర్పాట్ల గొడవ.. ఆ ఒక్క మాటతోనే అంతా తలకిందులు!

సుస్మిత తల్లి జానాబాయి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. జూన్ 23న కూతురి సీమంతం వేడుక ఏర్పాట్ల గురించి చర్చించేందుకు తల్లిదండ్రులు అల్లాదుర్గం వెళ్లారు. వేడుక ఎలా చేయాలనే విషయంపై భర్త అభిలాష్ వారితో తీవ్రంగా వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా, ఆమె శీలాన్ని శంకిస్తూ పుట్టబోయే బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేయించాలని అందరి ముందు మొండికేసాడు. ఈ అనుమానం భార్యాభర్తల మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది.

"చావడం కంటే వేరే మార్గం లేదు".. ఆవేదనతో ఉరికంభానికి!

ఆ సమయంలో స్థానిక పెద్దలు జోక్యం చేసుకుని వివాదాన్ని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత సుస్మిత తల్లిదండ్రులు తమ స్వగ్రామానికి తిరిగి వెళ్లిపోయారు. అయితే, భర్త అందరి ముందు తనను అవమానించడం, తన శీలాన్ని శంకించడం సుస్మితను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. ఆ వేదనను తట్టుకోలేక జూన్ 25 సాయంత్రం గడిపెద్దాపూర్‌లోని తన నివాసంలో సుస్మిత ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.

Video: చేయని నేరానికి పోలీసుల టార్చర్.. మహిళ 'సెల్ఫీ' సూసైడ్!
Video: చేయని నేరానికి పోలీసుల టార్చర్.. మహిళ 'సెల్ఫీ' సూసైడ్!

గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న సుస్మిత తల్లిదండ్రులు ఆందోళనతో అక్కడికి చేరుకుని విగతజీవిగా పడి ఉన్న కూతురిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. పెళ్లయిన నాటి నుంచి భర్త, అత్త లక్ష్మి పెట్టిన శారీరక, మానసిక వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని తల్లి జానాబాయి అల్లాదుర్గం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆవేదనగా కోరారు.

అపశకునపు పక్షి ఇప్పుడు ఆ ఊరికే గర్వకారణం: మోదీ
అపశకునపు పక్షి ఇప్పుడు ఆ ఊరికే గర్వకారణం: మోదీ

కటకటాల వెనక్కి నిందితులు: చట్టం తన పని తాను మొదలుపెట్టింది

బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 85 (భర్త లేదా బంధువులు వివాహితను క్రూరత్వానికి గురిచేయడం), సెక్షన్ 108 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) తో పాటు సెక్షన్ 3(5) కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోస్టుమార్టం ప్రక్రియ ముగిసిన అనంతరం సుస్మిత మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసులో శనివారం నాడు నిందితుడైన భర్త అభిలాష్, అత్త లక్ష్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని స్థానిక మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కట్నపు వేధింపులు, అనుమానం ఓ నిండు ప్రాణాన్ని బలిగొనడంపై పరిసర గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+