Hyderabad: మాదాపూర్ లో బోర్డు తిప్పేసిన సాఫ్ట్ వేర్ కంపెనీ..!
హైదరాబాద్ మాదాపూర్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావూరి హిల్స్ లోని సినెర్జీ యూనివర్సల్ కంపెనీ బోర్డు తిప్పెసినట్లుగా ఉద్యోగులు చెబుతున్నారు. కంపెనీ 500 మంది నుంచి రూ.2.50 లక్షలు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. తము ఉద్యోగం కోసం కంపెనీకి రూ.2.50 లక్షలు కట్టినట్లు చెబుతున్నారు. డబ్బులు కట్టిన తర్వాత ఆఫర్ లేటర్ ఇచ్చారని వారు వివరించారు. వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చారని.. ఉద్యోగంలో చేరి 6 నెలల గడిచిన జీతం ఇవ్వలేదని తెలిపారు.
చివరికి హైదరాబాద్ లోని ఆఫీస్ కు వస్తే మేనేజర్లు ఎవరు లేరని వాపోయారు. తాము మోసపోయినట్లు గ్రహించి పోలీసులు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు. తమ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి డబ్బు ఇచ్చారని.. ఆ డబ్బు వీరు తీసుకుని జీతాలు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు డబ్బు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. ఓ కన్సల్టేన్సీ ద్వారా రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల కట్టి ఉద్యోగంలో చేరినట్లు ఓ బాధితుడు తెలిపారు.

తమకు ఒక్కొక్కరి ఒక్కో ప్యాకేజీ ఇచ్చారని పేర్కొన్నాడు. కరోనా తర్వాత సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు తగ్గిపోయాయని.. బ్యాగ్ డోర్ ద్వారా డబ్బులు కట్టి రావాల్సి వస్తుందని అన్నారు. సినర్జీ యూనివర్సల్ స్టార్టప్ కంపెనీ అని చెప్పారు. జీతాలు ఇవ్వడం లేదని చెప్పాడు. ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే ప్రాజెక్టులు లేవని చెప్పారని వివరించాడు. మేనేజర్లు, హెచ్ ఆర్లు ఫోన్లు చేస్తే ఎత్తడం లేదని వాపోయారు. వీరు ఎవరూ కూడా కంపెనీకి రావడం లేదని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం చెక్కులు ఇచ్చారని చెప్పారు.
వాటిని బ్యాంక్ వెళ్లి డ్రా చేసే ప్రయత్నం చేయగా.. అవీ ఫేక్ చెక్స్ అని తేలినట్లు చెప్పారు. ఈ కంపెనీ ఇప్పటికే చాలా కేసులు ఉన్నట్లు బాధితులు తెలిపారు. అందరు కలిసి కంపెనీకి రూ.20 కోట్లు కట్టినట్లుగా వివరించారు. ప్రస్తుతం కంపెనీ లాస్ లో నడుస్తుందని మేజర్లు చెబుతున్నారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications