కీసర నాగరాజుపై మరో కేసు: ఈసారి 4 రిజిస్ట్రేషన్లు, వ్యాల్యూ రూ.2.68 కోట్లు..
కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు గుర్తున్నారు.. కదా.. రూ.1.10 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అయితే మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు. ఈ సారి మరో అవనీతి కేసు నాగరాజును వెంటాడింది. పట్టా భూమి కోసం డబ్బులు అడిగిన విషయం వెలుగుచూసింది. దీనిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మరో కేసును నమోదు చేశారు.

నలుగురికి అక్రమంగా పట్టాదారు పాసు పుస్తకాలు..
కీసర మండలం రాంపల్లిలో వేర్వేరు సర్వేనెంబర్లలో 24.16 ఎకరాల భూమికి సంబంధించి నలుగురికి అక్రమంగా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేశారు. దీనికి సంబంధించి విలెన్స్ అధికారులు నివేదిక అందజేశారు. దీంతో ఏసీబీ మరో కేసును నమోదు చేసింది. ఆ భూముల ఫైళ్లు ఆర్డీవో వద్ద పెండింగ్‌లో ఉన్న సమయంలో నాగరాజు నిబంధనలకు విరుద్ధంగా సంతకాలు చేసి, పాసు పుస్తకాలు జారీ చేశాడని ఆరోపణలు వచ్చాయి. దానిని విజిలెన్స్ అధికారులు నివేదించారు.

అంజిరెడ్డి బంధువు కావడంతో..
కందడి లక్ష్మమ్మ, కందడి బుచ్చిరెడ్డి, కందడి మణెమ్మ, స్థానిక రైతు కందడి ధర్మారెడ్డికి నాగరాజు పాసుపుస్తకాలు ఇచ్చాడు. లంచం కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన అంజిరెడ్డికి ధర్మారెడ్డి సమీప బంధువు కావడం విశేషం. నలుగురికి పాసుపుస్తకాలిచ్చిన భూమి మొత్తం 24.16 ఎకరాలు అని తెలుస్తోంది. దీని విలువ 2.68 కోట్లుగా ఉంటుందని గుర్తించారు. మార్కెట్ విలువ ప్రకారం ఆ భూమి మొత్తం విలువ రూ.48.80 కోట్లుగా ఉంటుందని తెలిపారు.

రూ.1.10 లక్షలకు డీల్
మరోవైపు రాంపల్లీ దయార వద్ద గల 19 ఎకరాల 39 గుంటల భూమిని ఒరిజినల్ పట్టదారులకు ఇప్పించేందుకు అంజిరెడ్డి మధ్యవర్తిత్వం చేశాడు. తహశీల్దార్ నాగరాజుకు 1.10 కోటి రూపాయలు డీల్ కుదుర్చాడు. శ్రీనాథ్ యాదవ్ అనే వ్యక్తి డబ్బులు సమకూర్చాడు. దీంతో పక్కా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు దాడులు చేసి వీరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఆర్టీఐ ద్వారా వెలుగులోకి..
రూ.కోటి 10 లక్షలు రియల్టర్ శ్రీనాథ్ వివరణ ఇచ్చారు. నాగరాజుకు శ్రీనాథ్ సహకరించాడన్న నేపథ్యంలో శ్రీనాథ్‌ను అధికారులు విచారించారు. రియల్ ఎస్టేట్‌కు చెందిన సత్య డెవలపర్స్ కోసం డబ్బులు తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చాడు. గుండ్ల పోచంపల్లిలో ఆక్రమణలకు గురైన భూముల వివరాలను ఆర్‌టీఐ ద్వారా సేకరించిన డాక్యుమెంట్లని అంజిరెడ్డి ఏసీబీకి వెల్లడించాడు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications