Crime News: హత్య చేసి ఇంటి ముందే పడేశారు.. జీడిమెట్లలో దారుణం.. భార్య పైనే అనుమానం..!

ఓ వ్యక్తిని హత్య చేసి మృతదేహాన్ని ఇంటి ముందే పడేశారు.

ఓ వ్యక్తిని హత్య చేసి మృతదేహాన్ని ఇంటి ముందే పడేసిన ఘటన హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం వెలిమెల గ్రామానికి చెందిన సురేష్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

అతను 2016లో రేణుక అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులు అక్కడే నివాసం ఉన్న వారు ఆ తర్వాత నగరానికి వచ్చారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ గాంధీనగర్ లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో వారికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. అందులో ఒకరు ఆరేళ్లు ఉండగా.. మరొకరు నలుగు సంవత్సరాలు ఉన్నారు. సురేష్‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుండగా.. రేణుక ఇంటి వద్దే ఉంటూ పిల్లలను చూసుకునేది.

An auto driver was murdered in Jedimetar and the body was dumped in front of the house

ఈ క్రమంలో రేణుక ఆదివారం భర్తను బిర్యానీ తీసుకురావాలని కోరింది. భార్య కోరిక మేరకు సురేష్ ఆహారం తీసుకురావడానికి బయటకు వెళ్లాడు. అతను బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ చెద్దామంటే మొబైల్ ఇంట్లోనే పెట్టి వెళ్లాడు. రేణుక అతని కోసం వెతికి పిల్లలతో కలిసి పడుకుంది. సోమవారం తెల్లవారుజాము 5 గంటల ప్రాంతంలో ఇంటి ముందు గోనె సంచీలో ఏదో ఉన్నట్లు ఇంటి ఓనర్ గుర్తించాడు. దగ్గరికి వెళ్లి చూడగా అందులో మృతదేహం ఉన్నట్లు భావించాడు.

మరింత దగ్గరికి వెళ్లి చూడగా.. అది సురేష్ మృతదేహాంగా గుర్తించాడు. ఈ విషయాన్ని వెంటనే రేణుకు తెలిపి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సురేష్ కనిపించకుండా పోయినా రేణుక పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సురేష్‌ హత్య వెనుక భార్య హస్తమున్నట్లు అనుమానిస్తున్నారు. రేణుకను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+