హైదరాబాద్ లో మరో దారుణం .. పిల్లలను బంధించి, తల్లిపై సామూహిక అత్యాచారం

హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. ఇంట్లో భర్త లేని సమయం చూసి, పిల్లలను బంధించి తల్లి పై సామూహిక అత్యాచారం చేశారు కొందరు కామాంధులు. వరుస అత్యాచార ఘటన లతో హైదరాబాద్ వాసులలో ఆందోళన మొదలైంది. ఇంట్లో ఉన్నా సేఫ్టీ లేదు అనే విషయం తాజాగా జరిగిన ఘటనతో వెలుగులోకి వచ్చింది.

ఇక వివరాల్లోకి వెళితే జల్‌పల్లి ముస్తఫా బస్తీకి హర్యానా కు చెందిన షాకీర్‌ఖాన్ కుటుంబం వలస వచ్చింది.షాకీర్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. వీరి ఇంటికి దగ్గరలోనే సమీప బంధువులు కూడా నివసిస్తున్నారు. ఈ క్రమంలో షాకీర్ డ్యూటీకి వెళ్లడంతో భార్య, పిల్లలతో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉంది.దీనిని గుర్తించిన బంధవులు అజాద్, అంజాద్‌లతో పాటు వారి స్నేహితుడు రాత్రి 10 గంటల సమయంలో షాకీర్ ఇంటికి వచ్చారు. మంచినీరు అడగటంతో ఆమె నీళ్లు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లింది .

Another brutal gang rape in Hyderabad... Captured children and raped their mother

నీరు తెచ్చేందుకు వెళ్ళిన ఆ మహిళను వెనుక నుంచి గట్టిగా పట్టుకుని బంధించారు. నలుగురు పిల్లలను మరో వ్యక్తి పక్క గదిలో ఉంచి గడియ పెట్టాడు. మిగిలిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. బాధితురాలు ప్రతిఘటిస్తే పిల్లల ప్రాణాలు తీస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. భర్త తరపున బంధువులైన వారే ఆ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు.

అర్థరాత్రి విధులు ముగించుకుని వచ్చిన భర్తకు ఆమె జరిగిన ఘోరాన్ని తెలిపిన మహిళ బోరున విలపించింది.దీంతో అతడు పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు అత్యాచార ఘటన జరిగిన ప్రాంతం హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల సరిహద్దుగా ఉండటంతో ఇరు కమిషనరేట్ల అధికారులు అక్కడికి చేరుకున్నారు. కానీ ఇది తమ పరిధి కాదంటూ మొదట కొంత తర్జనభర్జనలకు లోనైన పోలీసులు చివరికి పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+