కుట్ర కోణం.. అందుకే రాజకీయం.. వడ్డ కొనుగోలుపై టీఆర్ఎస్, బండి సంజయ్ బహిరంగ లేఖ
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంట కొనుగోలుపై బీజేపీ- టీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ పీక్‌కు చేరింది. అధికార పార్టీ నిరసనలు తెలియజేయడంతో.. బీజేపీ కూడా అదే విధంగా కౌంటర్ అటాక్ చేస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రైతులకు బహిరంగ లేఖ రాశారు. సీఎం కేసీఆర్‌ను విమర్శించారు. టీఆర్ఎస్ వడ్ల రాజకీయం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. కమీషన్లు దండుకునేందుకు స్కెచ్ వేసిందన్నారు. రైతులు అనివార్యంగా తక్కువ ధరకే వడ్లు విక్రయించేలా ప్లాన్ చేశారని అన్నారు.
రైతుల్లో వచ్చే ఆగ్రహాన్ని కేంద్ర ప్రభుత్వంపై మళ్లించే ప్లాన్ వేశారని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల మూసివేత అందులో భాగమే అని అన్నారు. కేసీఆర్ కుట్రతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుట్రలను ఛేదిధ్దాం రండి.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా కేసీఆర్ మెడలు వంచుదాం రండి.. రైతు పండించే ప్రతి గింజ కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది.. వడ్ల కొనుగోలు కోసం కేంద్రం గత ఏడేళ్లలో ఇప్పటికే తెలంగాణకు రూ.97వేల కోట్లను చెల్లించింది. వడ్ల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా ఇప్పటివరకు ఖర్చు చేయలేదన్నారు.

వడ్లను సేకరించి కేంద్రానికి అప్పగించకుండా టీఆర్ఎస్ సర్కార్ డ్రామాలాడుతోందని సంజయ్ మండిపడ్డారు. యాసంగి ధాన్యం సేకరణ వివరాలు కూడా కేంద్రానికి కేసీఆర్ ఇవ్వలేదని చెప్పారు. ఫిబ్రవరి 25వ తేదీ నాటి సమావేశ మినిట్స్ పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. కొనుగోలు కేంద్రాలను ఎందుకు మూసివేశారో సీఎం జవాబు చెప్పాల్సిందేనని లేఖలో డిమాండ్ చేశారు.
తెలంగాణలో యాసంగి ధాన్యం కొనేవరకు ఆందోళనలు చేస్తామని టీఆర్ఎస్ నేతలు ఆందోళన బాటపట్టారు. కేంద్ర ప్రభుత్వంపై ఎంతటి పోరాటానికైనా సిద్ధమని టీఆర్ఎస్ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. బ్యాంకులను మోసం చేసిన వారిని దేశం బయటికి పంపిన చరిత్ర బీజేపీ నేతలదని టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్రం ధాన్యం కొనుగోలుకు ముందుకు వస్తే మంచిదన్నారు.












Click it and Unblock the Notifications