రాష్ట్రంలో కేసీఆర్ తిరిగితే..: ప్రజా సంగ్రామ యాత్రపై బండి సంజయ్

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ నెంబర్ వన్ తెలంగాణ ద్రోహి అని మండిపడ్డారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లిలో ఆదివారం ఏర్ాపటు చేసిన చేనేత కార్మికుల సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు బీజేపీలో చేరారు.

టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేనేత పరిశ్రమ నిర్వీర్యమైందని బండి సంజయ్ విమర్శించారు. తమ ఆశీర్వాదంతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరమగ్గాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడమే కాకుండా, ఇళ్లు లేని అర్హులైన నేతన్నలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నేతన్నలకు శుభకాంక్షలు తెలిపారు బండి సంజయ్.

 Bandi Sanjay slams CM KCR in chenetha workers meeting.

రాష్ట్రంలో బీసీలకు ప్రాధాన్యం లేదని.. కొండా లక్ష్మణ్ బాపూజీని కనీసం గుర్తుంచుకోలేదన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర ఎందుకని టీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నారు.. రాష్ట్రంలో కేసీఆర్ తిరిగితే.. తాము ఎందుకు తిరుగుతామని ప్రశ్నించారు. చేనేత కుటుంబాల్లో ఎంత మందికి ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. నీతి ఆయోగ్ సమావేశానికి పోకుండా కేసీఆర్.. ఆ సంస్థను విమర్శిస్తున్నారని మండిపడ్డారు బండి సంజయ్.

ఇది ఇలావుండగా, సభ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి పెట్రోల్‌ బాటిల్‌తో హల్‌చల్‌ చేశాడు. పెట్రోల్ బాటిల్‌ పట్టుకుని స్టేజ్ ఎక్కేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. వెంటనే అతన్ని అడ్డుకున్నారు బీజేపీ కార్యకర్తలు. పెట్రోల్ బాటిల్ లాక్కొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో అక్కడ కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+