Hyderabad: గ్రూప్-1 అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్న బీసీ స్టడీ సర్కిల్..
గ్రూప్-1 కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ శుభవార్త అందించింది. గ్రూప్-1 కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఎంపిక అయిన వారికి మార్చి 29 నుంచి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 200 మంది అభ్యర్థులకు బోధించనున్నారు.
బ్యాచిలర్ డిగ్రీలలో ఫస్ట్-క్లాస్ మార్కులు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిగ్రీలో 50%,ఇంటర్మీడియట్, SSC మార్కులకు 20% వెయిటేజీ కూడా ఉంది. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యా, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల ధృవీకరణ నకళ్లతో పాటు ఓయూ క్యాంపస్‌లోని బీసీ స్టడీ సర్కిల్‌లో వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం, 040-24071178 లేదా 040-27077929కి కాల్ చేయండి.

అయితే ఈ మధ్యే గ్రూప్ -1 ప్రిలిమ్ల్ పేపర్ లిక్ అవడంతో పరీక్షను రద్దు చేశారు. ఈ పేపర్ లీక్ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేయడంతో పాటు విచారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ కాకుండా ఏఈ పరీక్ష కూడా రద్దు అయింది. పేపర్ లీక్ పై విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

అటు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. అయితే పేపర్ లిక్ కు సంబంధించి కేటీఆర్ పీఏ తిరుపతి ఉన్నట్లు పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీంతో ఆయన గురువారం సిట్ విచారణకు హాజరయ్యారు. శుక్రవారం బండి సంజయ్ కూడా హాజరుకావాల్సి ఉండగా.. ఆయన సిట్ కు లేఖ రాశారు.












Click it and Unblock the Notifications